iDreamPost
android-app
ios-app

ఒక్క బ్లాక్ బస్టర్.. రెమ్యూనరేషన్ అన్ని కోట్లు పెంచేశాడా?

  • Published Feb 10, 2024 | 7:50 PM Updated Updated Feb 10, 2024 | 8:50 PM

Teja Sajja Remuneration: హనుమాన్ తో తేజా సజ్జాకి చాలా మంచి విజయం లభించింది. ఇప్పుడు ఆ సక్సెస్ తర్వాత తేజా సజ్జా తన రెమ్యూనరేషన్ పెంచేశాడు అంటున్నారు.

Teja Sajja Remuneration: హనుమాన్ తో తేజా సజ్జాకి చాలా మంచి విజయం లభించింది. ఇప్పుడు ఆ సక్సెస్ తర్వాత తేజా సజ్జా తన రెమ్యూనరేషన్ పెంచేశాడు అంటున్నారు.

  • Published Feb 10, 2024 | 7:50 PMUpdated Feb 10, 2024 | 8:50 PM
ఒక్క బ్లాక్ బస్టర్.. రెమ్యూనరేషన్ అన్ని కోట్లు పెంచేశాడా?

ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఒక్క హిట్టుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. ఒక్క ఫ్లాపుతో ఇండస్ట్రీలో కనిపించకుండా కూడా పోవచ్చు. ఒకరి ఫేట్ ని ఆ ఒక్క సినిమా డిసైడ్ చేయగలదు. ప్రస్తుతం తేజా సజ్జ లైఫ్ లో ఆ ఒక్క సినిమా హనుమాన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తేజా సజ్జ.. హీరోగా తనకు కూడా అంత ఈజీగా అవకాశాలు రాలేదని.. చాలానే కష్ట పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ కష్టానికి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలాగే పనిలో పని రెమ్యూనరేషన్ విషయంలో కూడా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడంట. హనుమాన్ హిట్టు తర్వాత ఈ కుర్ర హీరో పారితోషకాన్ని భారీగా పెంచేశాడు అంటున్నారు.

తేజా సజ్జాకి ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. హనుమాన్ సినిమా తర్వాత తేజాకి నార్త్ లో కూడా రికగ్ నైజేషన్ లభించింది. ఈ మూవీని కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా థియేటర్లలో డీసెంట్ నంబర్స్ నే రాబడుతోంది. అలాంటి అతి భారీ విజయాన్ని ఈ మూవీ టీమ్ అనుభవిస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన లైఫ్ స్టైల్ మార్చేశాడు అంటున్నారు. రూ.6 కోట్లతో అత్యంత ఖరీదైన లగ్జరీ కారును బుక్ చేశాడు అంటూ నెట్టింట చాలానే వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు తేజా సజ్జా కూడా లైఫ్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డాట.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ కుర్రహీరోగా కూడా అదే పని చేస్తున్నాడు అంటున్నారు. పారితోషకం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడంట. తాను తర్వాత చేయబోయే సినిమాలకు రెమ్యూనరేషన్ ని భారీగా పెచేశాడు అని చెబుతున్నారు. నిజానికి హనుమాన్ సినిమా కోసం తేజా సజ్జ రూ.కోటిలోపే పారితోషకం అందుకున్నాడు. కానీ, తన తర్వాతి సినిమాలకు మాత్రం ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఏ హీరోకి ఎంత అయినా రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు. కానీ, దానిని ఒక క్రైటీరియా పద్ధతిలో డిసైడ్ చేస్తారు. ఆ హీరో మార్కెట్ ఎంత? అతని ఫ్యాన్ బేస్ ఎంత? అతని రీచ్ ఎంత? రీజనల్ హీరోనా? పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటగలడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. వాటిని బట్టే ఒక హీరోకి పారితోషకాన్ని ఇవ్వడానికి నిర్మాత ఇష్టపడతాడు.

ఇప్పుడు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ని తేజా సజ్జ ఫిల్ చేసేలాగే కనిపిస్తున్నాడు. ఈ కుర్ర హీరో హనుమాన్ తో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తిం సాధించాడు. అలాగే మంచి మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకోగలిగాడు. తేజా సజ్జా అంటే అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. అతని తర్వాతి సినిమాలపై హనుమాన్ హ్యూజ్ సక్సెస్ ఎంతో కొంతైనా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తేజా సజ్జ రెమ్యూనరేషన్ పెంచినా కూడా మేకర్స్ కి పెద్ద ఇబ్బంది ఉండదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఎంచుకునే కథలు, వాటికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి అతని కెరీర్ ఆధారపడి ఉంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హనుమాన్ సినిమా తర్వాత తేజా సజ్జా రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio