iDreamPost
android-app
ios-app

Hanuman: వీడియో: హనుమాన్‌ థియేటర్‌లో ఆ మహిళకి జరిగింది ఇదే! అసలు నిజం!

  • Published Jan 30, 2024 | 11:29 AM Updated Updated Jan 30, 2024 | 1:15 PM

హనుమాన్‌ సినిమా చూసి ఓ మహిళ పూకం వచ్చి ఊగిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకు అసలు వాస్తవం ఏంటి అంటే ఆ వివరాలు..

హనుమాన్‌ సినిమా చూసి ఓ మహిళ పూకం వచ్చి ఊగిపోయింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతకు అసలు వాస్తవం ఏంటి అంటే ఆ వివరాలు..

  • Published Jan 30, 2024 | 11:29 AMUpdated Jan 30, 2024 | 1:15 PM
Hanuman: వీడియో: హనుమాన్‌ థియేటర్‌లో ఆ మహిళకి జరిగింది ఇదే! అసలు నిజం!

సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్‌ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులన్నింటిని బద్దలు చేస్తోంది. విడుదలకు ముందు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నదో.. రిలీజ్‌ తర్వాత.. అంతకు రెట్టింపు రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. సినిమా విడుదలై మూడు వారాలకు పైగా కావొస్తున్న హనుమాన్‌ క్రేజ్‌ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి కూడా థియేటర్లన్ని హౌజ్‌ఫుల్‌ అవుతున్నాయి. అతి తక్కువ బడ్జెట్‌తో.. ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన వీఎఫ్‌ఎక్స్‌ దృశ్యాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాకు ఇదే ప్రధాన ఆకర్షణగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

క్లైమాక్స్‌ సీన్‌ చూస్తే గూస్‌బంప్స్‌ పక్కా. అంత అద్భుతంగా హనుమాన్‌ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంది అంటే.. థియేటర్లలో కూర్చుని మూవీ చూస్తోన్న జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు. అంతేకాక రియల్‌గా కూడా ఓ చోట ఇలాంటి దృశ్యమే వెలుగులోకి వచ్చింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. హనుమాన్‌ సినిమా చూస్తూ.. ఓ మహిళ దేవుడు ఆవహించినట్లుగా పూనకంతో ఊగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. ఉప్పల్‌లోని ఏసియన్‌ మాల్‌లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ మహిళ హనుమాన్ సినిమాను చూస్తూ దేవుడొచ్చినట్టుగా ఊగిపోయింది అంటూ ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

హనుమాన్ సినిమా చివర్లో వచ్చే పాటకు సదరు మహిళ ఇలా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోయింది అని ప్రచారం జరిగింది. పక్కనున్న వారు ఆమెని కంట్రోల్‌ చేసే ప్రయత్నం చేశారని కూడా తెలిపారు. ఇక అక్కడున్న వారు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు బహుశా ఆమెలో ఉన్న నెగిటివ్‌ శక్తి.. ఈ సీన్స్‌​ చూసి పారిపోయిందేమో అని కామెంట్స్‌ కూడా చేశారు. అయితే వాస్తవం ఏంటి అంటే సినిమా చూస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్‌ వచ్చాయి. ఈ విషయం తర్వాత తెలిసింది. కానీ ఈలోపే సోషల్‌ మీడియాలో హనుమాన్‌ సినిమా చూస్తుండగా మహిళకు పూనకం అని ప్రచారం చేశారు.

ఇక హనుమాన్‌ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే 250 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఇంక హనుమాన్‌ మ్యానియా కొనసాగుతుంది. ఇప్పుడు చిత్రానికి డిమాండ్‌కు తగ్గ థియేటర్లు లభిస్తున్నాయి. నార్త్‌లోనూ ఈ సినిమా ఇంకా ఆడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetrupi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş