iDreamPost
android-app
ios-app

PVCU: ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సూపర్ హీరో ఫిల్మ్ ఇదే.. పెద్ద ప్లానే!

  • Published Jan 12, 2024 | 6:58 PM Updated Updated Jan 12, 2024 | 6:58 PM

హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దీంతో అతడి సినిమాటిక్ యూనివర్స్ లో నెక్ట్స్ సూపర్ హీరో ఫిల్మ్ ఏంటని అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమాన్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. దీంతో అతడి సినిమాటిక్ యూనివర్స్ లో నెక్ట్స్ సూపర్ హీరో ఫిల్మ్ ఏంటని అందరు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jan 12, 2024 | 6:58 PMUpdated Jan 12, 2024 | 6:58 PM
PVCU: ప్రశాంత్ వర్మ నెక్ట్స్ సూపర్ హీరో ఫిల్మ్ ఇదే.. పెద్ద ప్లానే!

హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు జపిస్తున్న పేరు. సంక్రాంతి కానుకగా శుక్రవారం(జనవరి 12న) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన టేకింగ్ తో సినిమా రేంజ్ ను పెంచేశాడు. అతి తక్కువ టైమ్ లోనే రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్ ను చూపించి.. మనల్ని ఆశ్చర్యపరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇక హనుమాన్ భారీ విజయం సాధించడంతో.. ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ హీరోల సినిమాలు నిర్మిస్తానని ముందునుంచే చెప్పుకొస్తున్నాడు. అందులో భాగంగా హనుమాన్ ను తెరకెక్కించాడు. ఇక తన సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్ట్స్ ఫిల్మ్ పై ఫోకస్ పెట్టాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాలో ఓ కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అతడు ఓ బడా నిర్మాత కొడుకు కావడం గమనార్హం. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమ్రోగుతున్న పేరు. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. జాంబి రెడ్డితో తెలుగు పరిశ్రమకు సరికొత్త జానర్ ను పరిచయం చేసిన ఈ యువ దర్శకుడు.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా సూపర్ హీరోస్ ఫిల్మ్స్ ను టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేశాడు. అందులో భాగమే తాజాగా విడుదల చేసిన ‘హనుమాన్’. తేజ సజ్జ, అమృత అయ్యర్, సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.

జనవరి 12 శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి సూపర్ హీరో మూవీని ఎలా తెరకెక్కించాడు అంటూ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇదిలా ఉండగా..తన సినిమాటిక్ యూనివర్స్ లో నెక్ట్స్ వచ్చే సినిమాపై అందరి దృష్టి పడింది. ప్రశాంత్ తర్వాత సూపర్ హీరో సినిమా పేరు ‘అధీర’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ గతంలోనే విడుదల అయ్యాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ కింద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నాడు ఈ యువ దర్శకుడు.

prashant varma next super hero movie

ఇక ఈ సూపర్ హీరో మూవీతో స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కే. నిరంజన్ రెడ్డి నిర్మాతగా పాన్ ఇండియా రేంజ్ లో సిద్దమవుతోంది. సాధారణగా హాలీవుడ్ లోనే ఇలాంటి సూపర్ హీరోల సినిమాలు మనం చూస్తుంటాం. అలాంటిది ఆ ట్రెండ్ ను ప్రశాంత్ వర్మ టాలీవుడ్ కు పరిచయం చేసి.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. హనుమాన్ మూవీకి మించి ఉండేలా ‘అధీర’ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సూపర్ సక్సెస్ కావడంతో.. మరింత ఉత్సాహంతో సూపర్ హీరోల ఫిల్మ్స్ తెరకెక్కించడానికి ఉరకలేస్తున్నాడు డైరెక్టర్. మరి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio