iDreamPost
android-app
ios-app

Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఈమె చాలా స్పెషల్!

  • Published Jan 29, 2024 | 2:34 PM Updated Updated Jan 29, 2024 | 2:42 PM

సంక్రాంతికి వచ్చిన హనుమాన్‌ సినిమా క్రేజ్‌ ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు . ఇంతకు ఎవరా వ్యక్తి.. తనతో ప్రశాంత్‌ వర్మ రిలేషన్‌ ఏంటి అంటే..

సంక్రాంతికి వచ్చిన హనుమాన్‌ సినిమా క్రేజ్‌ ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని అందరికి పరిచయం చేశాడు . ఇంతకు ఎవరా వ్యక్తి.. తనతో ప్రశాంత్‌ వర్మ రిలేషన్‌ ఏంటి అంటే..

  • Published Jan 29, 2024 | 2:34 PMUpdated Jan 29, 2024 | 2:42 PM
Prasanth Varma: హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి ఈమె చాలా స్పెషల్!

హనుమాన్‌ సినిమాతో పాన్‌ ఇండియా వైడ్‌గా ఒక్కసారిగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. తేజ సజ్జ హీరోగా, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా.. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హనుమాన్‌ సినిమా సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విడుదలయ్యింది. చిన్న సినిమాగా రిలీజై.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మూడు వారాలు కావొస్తున్నా కలెక్షన్ల విషయంలో మాత్రం ఇంకా దూసుకుపోతూనే ఉంది.

సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిత్రం బృందం తాజాగా ఆదివారం నాడు హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. సినిమా సాధించిన విజయంపై ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ వేడుకలో ఒకరు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పైగా ఆ వ్యక్తికి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ లైఫ్‌లో చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు.. ప్రశాంత్‌ వర్మతో తనకి ఉన్న రిలేషన్‌ ఏంటి అంటే..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ టూ డైరెక్టర్‌..

హనుమాన్‌ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ.. సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశాడు. మూవీ లవర్‌ కావడంతో.. ఇండస్ట్రీలోకి రావాలని భావించి.. ముందుగా షార్ట్‌ ఫిల్మ్‌లు తీసి.. తనను తాను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత నాని ప్రొడ్యూసర్‌గా మారి తెరకెక్కించిన అ! సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారాడు ప్రశాంత్‌ వర్మ. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలు తీసి.. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా నిరూపించుకున్నాడు. ఇక ఈ ఏడాది ఏకంగా హనుమాన్‌ సినిమాతో పాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని షేక్‌ చేశాడు ప్రశాంత్‌ వర్మ.

హనుమాన్‌ సినిమా తర్వాత ప్రశాంత్‌ వర్మ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌లో తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని అందరికి పరిచయం చేసి షాకిచ్చాడు ప్రశాంత్‌ వర్మ. ఇంతకు ఆ స్పెషల్‌ పర్సన్‌ ఎవరంటే.. ఆయన భార్య. అవును మీరు విన్నది నిజమే. ప్రశాంత్‌ వర్మకు పెళ్లైంది. తాజాగా హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ సందర్భంగా భార్యని అందరికి పరిచయం చేశాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌.

హనుమాన్‌ సక్సెస్‌ మీట్‌ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే.. తన భార్య గురించి మాట్లాడాడు. ఇన్నాళ్ల సినీ ప్రయాణంలో తనకు అన్నీ వేళలా అండగా నిలిచిన భార్యకు థ్యాంక్స్‌ చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించాడు. అలా తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని తొలిసారి అందరికి పరిచయం చేశాడు. ఆయనకు పెళ్లైందనే విషయం తెలిసి.. చాలా మంది ఆశ్చర్యపోయారు. ప్రశాంత్‌ వర్మను చూస్తే.. చాలా యంగ్‌గా కనిపిస్తారు. అలాంటిది ఆయనకు పెళ్లి ఎప్పుడయ్యింది.. ఇంతకు భార్య పేరు ఏంటి అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు జనాలు.

పాలకొల్లుకు చెందిన ప్రశాంత్‌ వర్మకు కరోనా సమయంలోనే వివాహం జరిగింది. ఆయన భార్య పేరు సుకన్య. ఇక వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే ప్రశాంత్‌ వర్మ వివాహం సమయానికి ఆయన పెద్ద దర్శకుడు కాకపోవడంతో.. పెళ్లి గురించి, ఆయన భార్య గురించి ఎవరికి పెద్దగా తెలియలేదు. ఇక ప్రశాంత్‌ వర్మ భార్య సుకన్య ఫొటోలు చూసిన వారు.. ఆమె ఎంతో అందంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉన్నారంటున్నారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş