ఇంకా ఆగని హనుమాన్ బిజినెస్! ఇప్పుడు విదేశాల్లో రిలీజ్!

సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి హనుమాన్. తేజ, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి హనుమాన్. తేజ, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.

చిన్న బడ్జెట్ మూవీగా తెరకెక్కిన హనుమాన్ పెద్ద ప్రభంజనమే సృష్టించింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ పాన్ ఇండియా మూవీ కలెక్షన సునామీ సృష్టించింది. తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ.. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ అలరించింది. సుమారు 40 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. రూ. 300 కోట్లకు పైగా రాబట్టుకుని ఇండస్ట్రీ హిట్ చిత్రంగా నిలిచింది. ఇంత స్థాయిలో కలెక్షన్లు రావడంతో ఫుల్ ఖుషీలో ఉంది చిత్ర యూనిట్. సినిమాపై తాను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు ప్రశాంత్ వర్మకి. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఓటీటీల్లో కూడా సందడి చేసేందుకు సిద్దమైంది.

జీ5 ఓటీటీలో మార్చి 8 అనగా మహా శివరాత్రి నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే.. జనవరి 12న విడుదలైన ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. వారం రోజులు థియేటర్లలో సినిమా ఆడటం గొప్ప అనుకునే ఈ రోజుల్లో.. హనుమాన్ చిత్రం అర్థ శతాబ్ద వేడుకలు జరుపుకోవడం విశేషం. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం.  ఈ సందర్భంగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. కాగా, హనుమాన్ సీక్వెల్ ఉండబోతుందని గతంలో ప్రకటించాడు దర్శకుడు. దీనిపై వర్క్ జరుగుతుంది. కాగా, 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రశాంత్ వర్మ ఇంటస్ట్రింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఓ సినిమా సక్సెస్ అనేది చాలా మంది లైఫ్ మారుస్తుందన్న ఆయన.. ప్రొడ్యూసర్ నుండి సైకిల్ స్టాండ్స్ పనిచేసే వాళ్ల వరకు మారుతుందని చెప్పారు.

‘హనుమాన్ రీ మాప్టర్ వెర్షన్ రాబోతుంది. అది ఇంకా సర్ ప్రైజ్ చూస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నుండి వచ్చిన ఈ తొలి సినిమా.. చాలా పెద్ద యూనివర్స్‌కు పెద్ద హెల్ప్ కాబోతుంది. ఇప్పటి వరకు ఎంత ఎక్కువ కష్టపడ్డామో.. పదింతలు కష్టపడి.. క్వాలిటీ సినిమాలు..వీలైనంత త్వరగా అందిస్తాం. మా యూనివర్శ్ నుండి మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. నిజంగా జెన్యూన్ గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయ్యాక మేము పార్టీ చేసుకోలేదు. ఇదే జరుపుకోవడం. రిలీజైన నాటి నుండి ఈ సినిమా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా త్వరలో ఇంటర్నేషనల్ లెవల్లో విడుదల కాబోతుంది. స్పెయిన్, జపాన్, చైనా డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడం, వారికి సినిమా నచ్చింది.

త్వరలో ఇంటర్నేషన్ లెవల్లో రిలీజ్ కాబోతుంది. మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నామో.. రేపు ప్రపంచ దేశాల్లో కూడా ఈ తెలుగు సినిమా గొప్పతనం చాటబోతుంది. ఇది మా నిర్మాత నిరంజన్ వల్లే. జై హనుమాన్ మూవీ వర్క్ స్టార్ అయ్యింది. త్వరలో దానికి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సారి హనుమంతుల వారే హీరో.  క్లైమాక్స్ ఎంత నచ్చిందో.. అది రెండున్నర గంటల పాటు ఉండబోతుంది‘ అని చెప్పారు ప్రశాంత్ వర్మ.  ఈ లెక్క ప్రకారం.. హనుమాన్ మూవీ మరోసారి బిజినెస్ షురూ చేసింది. ఈ సారి మూడు దేశాల్లో విడుదల చేయబోతున్నారంటే.. టార్గెట్ బిగ్ ఉండబోతుంది. సుమారు వెయ్యి కోట్ల కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు అర్థమౌతుంది. వాట్ ఎ ప్లాన్.

Show comments