iDreamPost
android-app
ios-app

మహేశ్ బాబు నాకు ఆ ఒక్క రిక్వెస్ట్ చేశారు! తేజ కామెంట్స్ వైరల్!

Teja Sajja On Mahesh Babu: సంక్రాంతికి సినిమాలు సిద్ధమైపోయాయి. అందరూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఎవరూ హిట్ కొడతారు? ఎవరు హీరో అవుతారు అంటూ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Teja Sajja On Mahesh Babu: సంక్రాంతికి సినిమాలు సిద్ధమైపోయాయి. అందరూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఎవరూ హిట్ కొడతారు? ఎవరు హీరో అవుతారు అంటూ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

మహేశ్ బాబు నాకు ఆ ఒక్క రిక్వెస్ట్ చేశారు! తేజ కామెంట్స్ వైరల్!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, డూడూ బసవన్నలతో పల్లెటూర్లు సింగారించుకున్నాయి. అలాగే సినిమా సందడి కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సంక్రాంతికి మొత్తం 4 పెద్ద చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేశ్ సైంధవ్, తేజ సజ్జా హనుమాన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో గుంటూరు కారం, హనుమాన్ చిత్రాలు జనవరి 12న విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీస్ మధ్య వార్ అన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ, తేజా సజ్జ మాత్రం మహేశ్ తో తనకున్న అనుబంధాన్ని వెల్లడించాడు.

ప్రస్తుంతం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. సాంగ్స్, పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్స్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్, టాలీవుడ్ హీరో తేజా సజ్జ కూడా తన హనుమాన్ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ ఇంటరవ్యూలు ఇస్తున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అతనికి మహేశ్ బాబుకు ఉన్న అనుబంధాన్ని ప్రేక్షకులకు ఒక సందర్భాన్ని చెబుతూ వివరించాడు. తేజా సజ్జ మహేశ్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడనే విషయం అందరికీ తెలిసిందే. మహేశ్ హీరోగా డెబ్యూ చేసిన రాజకుమారుడు చిత్రంలో తేజ కూడా యాక్ట్ చేశాడు. అలాగే యువరాజు చిత్రంలో కూడా మహేశ్ తో కలిసి తేజా సజ్జ నటించాడు. ఆ మూవీస్ సమయంలో జరిగిన ఒక ఫన్నీ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

teja sajja comments on mahesh

“నేను రాజకుమారుడు షూటింగ్ టైమ్ లో మగేశ్ అన్న మగేశ్ అన్నా అని పిలిచేవాడిని. నాకు బాగా గుర్తుంది.. ఆయన నన్ను పిలిచి నీకు నా పేరు పలకడం రాకపోతే అన్నా అని పిలువు. నా పేరుని మాత్రం ఖూనీ చేయకు అన్నారు. ఆ రోజుల్లో చాలా సరదాగా ఉండేది. నేను ఆయన టూ ఫిల్మ్స్ లో బ్యాక్ టూ బ్యాక్ వర్క్ చేశాను. రాజకుమారుడు, యువరాజు చిత్రాల్లో నటించాను. నన్ను ఒక ఫ్యామిలీగా చూసేవాళ్లు. అలాంటి పరిస్థితులు లేకపోతే అన్ని సినిమాలు నేను చేయగలిగే వాడిని కాదేమో. చైల్డ్ ఆర్టిస్టుగా చెబుతున్నా.. చైల్డ్ ఆర్టిస్టుతో యాక్ట్ చేయడం చాలా కష్టం” అంటూ తేజా సజ్జ మహశ్ బాబు తనకి చేసిన రిక్వెస్ట్ ని రివీల్ చేశాడు.

ప్రస్తుతం జనవరి 12న విడుదలవుతున్న మహేశ్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జ హనుమాన్ చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొనే పరిస్థితి ఉంది. మహేశ్ స్టార్డమ్- మాస్ ఎలివేషన్స్, హనుమాన్.. హనుమంతుడి సూపర్ హీరో కాన్సెప్ట్ కి మధ్య పోటీ ఉండబోతోంది. అలాగే నా సామిరంగ, సైంధవ్ చిత్రాలకు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఈ సంక్రాంతికి ఎవరు హిట్ కొడతారో? ఎవరు హీరో అవుతారో? వేచి చూడాలి. మరి.. మహేశ్ తనకున్న అనుబంధం గురించి తేజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark giriştimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş