iDreamPost
android-app
ios-app

Hyper Aadi: హైపర్ ఆదిపై హీరోయిన్ ఫైర్.. నోరు మూసుకో అంటూ వార్నింగ్

  • Published Jun 09, 2024 | 3:16 PM Updated Updated Jun 09, 2024 | 3:16 PM

హైపర్‌ ఆదికి స్టేజీ మీద ఓ హీరోయిన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఏకంగా నోరు మూసుకో అంటూ సీరియస్‌ అయ్యింది. అసలేం జరిగింది.. ఎందుకు ఆ హీరోయిన్‌ ఇలాంటి వార్నింగ్‌ ఇచ్చింది అంటే..

హైపర్‌ ఆదికి స్టేజీ మీద ఓ హీరోయిన్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఏకంగా నోరు మూసుకో అంటూ సీరియస్‌ అయ్యింది. అసలేం జరిగింది.. ఎందుకు ఆ హీరోయిన్‌ ఇలాంటి వార్నింగ్‌ ఇచ్చింది అంటే..

  • Published Jun 09, 2024 | 3:16 PMUpdated Jun 09, 2024 | 3:16 PM
Hyper Aadi: హైపర్ ఆదిపై హీరోయిన్ ఫైర్.. నోరు మూసుకో అంటూ వార్నింగ్

హైపర్‌ ఆది.. ఇప్పుడు ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి.. తన రైటింగ్‌ స్కిల్స్‌తో వరుస పంచులు వేస్తూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీమ్‌ లీడర్‌గా కూడా మారాడు. జబర్దస్త్‌ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆ తర్వాత అనేక షోలకు యాంకర్‌గా చేశాడు. ఇప్పుడు సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నాడు. ఇదంతా ఒకవైపు అయితే.. హైపర్‌ ఆది మీద విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఆది తన స్కిట్స్‌లో అమ్మాయిలను తక్కువ చూపించేలా.. వివాహేతర సంబంధాల గురించి ఎక్కువ స్కిట్స్‌ రాస్తుంటాడనే విమర్శ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్‌ హైపర్‌ ఆది మీద సీరియస్‌ అయ్యింది. నోరుమూసుకో అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

హైపర్ ఆది ప్రస్తుతం ఢీ షోలో చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ షోకి ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం.. ఈ షోలో ప్రణీత స్థానంలో యాపిల్ బ్యూటీ హన్సిక కనిపిస్తుంది. ఇక శేఖర్‌ మాస్టర్‌ మాత్రం అలానే కొనసాగుతున్నారు. తాజాగా ఈ బుధవారం టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలైంది. దీనిలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌పై తనదైన పంచులు వేస్తూ రెచ్చిపోయాడు హైపర్‌ ఆది. ఇక ఈ వారం ఢీ షోకు గెస్టులుగా సుధీర్ బాబు రావడం జరిగింది. శేఖర్‌ మాస్టర్‌కు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుధీర్ బాబు కావడంతో.. ఆయన సినిమాకు లింక్ చేస్తూ సెటైర్లు వేశాడు ఆది.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘‘మీరు ఎస్ఎంఎస్ చిత్రం ఒక్కసారే చేశారు. కానీ శేఖర్ మాస్టర్ కొందరికి ప్రతి రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు’’ అని సెటైర్ వేశారు. ‘‘మీ ప్రేమ కథా చిత్రంలో దెయ్యాన్ని చూసి మీరు పారిపోతారు.. కానీ శేఖర్ మాస్టర్‌ని చూసి దెయ్యమే పారిపోతుంది’’ అంటూ హైపర్ ఆది మరో పంచ్ వేశాడు. దీనితో కొత్తగా వచ్చిన హన్సిక శేఖర్ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తూ హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చారు. ఏయ్ ఆది.. శేఖర్ మాస్టర్ చాలా మంచి వారు.. నీ నోరు మూసుకో అంటూ హన్సిక ఇచ్చిన వార్నింగ్ చాలా ఫన్నీగా ఉంది. మీకు నాలుగు రోజుల తర్వాత ఆయన గురించి అర్థం అవుతుంది చూడండంటూ హన్సికకు హైపర్ ఆది కౌంటరిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet