iDreamPost
android-app
ios-app

గుప్పెడంత మనసు వసుధార బ్యాగ్రౌండ్ తెలుసా? కేవలం సీరియల్స్ మాత్రమే కాదు..

  • Published Aug 12, 2024 | 5:11 PM Updated Updated Aug 12, 2024 | 5:16 PM

Guppedantha Manasu Serial Actress Raksha Gowda: బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ధారావాహికల్లో ఒకటి గుప్పెడంత మనసు. 1150 ఎపిసోడ్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. తర్వలో ఎండ్ కార్డు పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రిషి సార్- వసుధార పాత్రలో మెప్పించారు ముఖేష్ గౌడ్, రక్షా గౌడ్. అయితే వసుధార బ్యాగ్రౌండ్ తెలిస్తే..

Guppedantha Manasu Serial Actress Raksha Gowda: బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ధారావాహికల్లో ఒకటి గుప్పెడంత మనసు. 1150 ఎపిసోడ్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. తర్వలో ఎండ్ కార్డు పడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రిషి సార్- వసుధార పాత్రలో మెప్పించారు ముఖేష్ గౌడ్, రక్షా గౌడ్. అయితే వసుధార బ్యాగ్రౌండ్ తెలిస్తే..

  • Published Aug 12, 2024 | 5:11 PMUpdated Aug 12, 2024 | 5:16 PM
గుప్పెడంత మనసు వసుధార బ్యాగ్రౌండ్ తెలుసా? కేవలం సీరియల్స్ మాత్రమే కాదు..

మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బుల్లితెర సీరియల్ గుప్పెడంత మనసు. రిషి-వసుధార క్యారెక్టర్లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. 2020లో స్టార్ మాలో ప్రారంభమైన ఈ ధారావాహిక అనతి కాలంలోనే ఆకట్టుకుంది. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు ఉమెన్ ఫ్యాన్స్‌ను టీవీలకు కట్టిపడేసేలా చేసింది ఈ సీరియల్. రిషి పాత్రలో ముఖేష్ గౌడ, వసుధార పాత్రలో రక్షా గౌడ తమ నటనతో వీక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పటి వరకు 1150 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. తొలుత లవర్స్‌గా, ఇప్పుడు భార్యా భర్తలుగా ఆకట్టుకుంటున్నారు రిషి-వసుధార. ఇక ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు పడబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రిషి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు మళ్లీ టీఆర్పీ రేటింగ్ పుంజుకుంటున్న ఈ సమయంలో ఊహించని విధంగా షో ముగుస్తుందన్న వార్త తెలియగానే గగ్గోలు పెడుతున్నారు మహిళాభిమానులు.

గుప్పెడంత మనసు సీరియల్ ఆగిపోవడానికి బిగ్ బాసే కారణం అంటూ వాదన వినిపిస్తుంది. ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్‌లో కన్ఫమ్ అయ్యాడట. అలాగే తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో వసుధార అలియాస్ రక్షాగౌడ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ షోకు ముగింపు పలకాలని భావించాడట దర్శకుడు. ఎందుకుంటే రిషి-వసుధార పాత్రలు అంతలా కనెక్ట్ అయ్యాయి. వీరి ప్లేసులో మరొకర్ని తెచ్చినా.. వీళ్లలా ఆకట్టుకుంటారో లేదో తెలియదు. సోల్ మిస్ అయితే.. టోటల్ ధారావాహికకే ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలున్నాయి. అందుకు ఈ సీరియల్‌కు స్వస్థి పలకాలనుకుంటున్నాడా డైరెక్టర్. ఇక ఈ సీరియల్లో రిషి సార్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. వసుధారకు కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడ నాట నుండి వచ్చి తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకున్న ఈ చిన్నదాని బ్యాగ్రౌండ్ తెలిస్తే.. బిత్తరపోతారు.

కర్ణాటకలోని మైసూరులో పుట్టిన రక్షా గౌడ్.. బెంగళూరులో విధ్యాభ్యాసం ముగించింది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తండ్రి బయో మెడికల్ ఇంజనీర్, తల్లి నర్సు. ఆమె డాక్టర్, ఐఎఏస్ కాావాలనుకుని చివరకు బీబీఎం చేసింది. ఆ తర్వాత కన్నడ సీరియల్స్ చేసింది. రాధా రమణ సీరియల్లో అన్విత పాత్రలో మెప్పించింది. అలాగే గరుడ దక్ష అనే చిత్రంలో కూడా యాక్ట్ చేసింది. అటు నుండి తెలుగు తెరపైకి వచ్చింది. స్టార్ మాలో కృష్ణవేణి అనే సీరియల్ చేసింది. అక్కడ నుండి ఆమెకు గుప్పెడంత మనసు సీరియల్ అవకాశం వచ్చింది. వసుధారగా అందరి మనస్సులు దోచేసింది. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుందని, త్వరలో ఎండ్ కార్డు పడనున్నట్లు ఓ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. నిజమా, కాదా అని సీరియల్ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Raksha Gowda (@rakshaa_official)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet