iDreamPost
android-app
ios-app

Jyothi Rai: యూత్‌ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జగతీ మేడమ్‌!

  • Published Dec 02, 2023 | 4:03 PM Updated Updated Dec 02, 2023 | 4:03 PM

గుప్పెడంత మనసు సీరియల్ అతి తక్కువ సమయంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతటి ఆదరణ పొందిన ఆ సీరియల్ లో రిషికి తల్లిగా నటించిన జగతి కూడా మంచి పాపులారిటిని సంపాదించుకుంది.

గుప్పెడంత మనసు సీరియల్ అతి తక్కువ సమయంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అంతటి ఆదరణ పొందిన ఆ సీరియల్ లో రిషికి తల్లిగా నటించిన జగతి కూడా మంచి పాపులారిటిని సంపాదించుకుంది.

  • Published Dec 02, 2023 | 4:03 PMUpdated Dec 02, 2023 | 4:03 PM
Jyothi Rai: యూత్‌ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జగతీ మేడమ్‌!

జ్యోతి రాయ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ, ‘గుప్పెడంత మనసు’ సీరియల్ జగతి అంటే టక్కున గుర్తుపడతారు. ఈ సీరియల్‌తో అంతగా తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ కన్నడ భామ. గుప్పెడంత మనసులో గృహిణిగా చీరకట్టులో కనిపించారు. సీరియల్లో మేడమ్ పాత్రలో ఒదిగిపోయి సంప్రదాయమైన కట్టు బొట్టుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. తెలుగులో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నారు.

తెలుగులోనే కాదు.. కన్నడలోనూ ఈమెకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె కన్నడలో పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు. ఇక, జ్యోతి రాయ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటూ ఉంటారు. సీరియల్స్‌తో చీరకట్టులో కనిపించే జ్యోతి రాయ్‌.. సోషల్‌ మీడియా మోడ్రన్‌ డ్రెస్సులతో అదరగొడుతున్నారు. తరచుగా సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ఆమె తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పెట్టే మోడ్రన్‌ డ్రెస్‌ ఫొటోలు వైరల్‌గా మారుతూ ఉన్నాయి. తాజాగా, కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కొన్ని ఫొటోలు పెట్టారు.  ఆమె బ్లాక్ కలర్ షార్ట్ టీషర్ట్, ప్యాంట్‌తో ఇచ్చిన ఫోజుల తాలూకా ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వయసు పెరుగుతోన్నా.. వన్నె తగ్గని అందాలతో హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్నారు జ్యోతిరాయ్. రోజురోజుకి ఈమె అందం రెట్టింపు అయిపోతోందా అనేలా గ్లామర్ షో ఉండటం విశేషం. అయితే గత కొద్ది రోజులుగా జ్యోతిరాయ్ తన వ్యక్తిగత విషయాలతో కూడా నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.

జ్యోతికి ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడు. విభేదాల కారణంగా భర్తతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. టాలీవుడ్‌కి చెందిన ఒక యంగ్ డైరెక్టర్‌తో రిలేషన్ షిప్‌లోకి అడుగుపెట్టారు. తర్వాత జ్యోతిరాయ్ లుక్, స్టైల్ అన్నీ మారిపోయాయి. ఇదే తన ఒరిజినల్ అని కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా సందర్భాలలో ఇన్ స్టాగ్రామ్ చాట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఓటీటీలోకి ఎంటర్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. తన బాయ్ ఫ్రెండ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ‘ది ప్రిట్టీ గర్ల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో కూడా జ్యోతిరాయ్ అందాలతో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక, ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతం జ్యోతి రాయ్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి, జ్యోతిరాయ్ ఫోటోస్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom