iDreamPost
android-app
ios-app

రూమర్లకు చెక్‌.. ప్రియుడితో జ్యోతిరాయ్‌ ఎంగేజ్‌మెంట్‌!

  • Published Sep 29, 2023 | 6:09 PM Updated Updated Sep 29, 2023 | 6:09 PM
  • Published Sep 29, 2023 | 6:09 PMUpdated Sep 29, 2023 | 6:09 PM
రూమర్లకు చెక్‌.. ప్రియుడితో జ్యోతిరాయ్‌ ఎంగేజ్‌మెంట్‌!

తెలుగు రాష్ట్రాల్లో ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్‌లో నటిస్తున్న ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇక, ప్రధాన పాత్రధారుల గురించి చెప్పనక్కర్లేదు. అలా ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌తో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు జ్యోతిరాయ్‌. ఈమెది కర్ణాటక అయినా.. తెలుగులో సీరియల్స్‌ చేస్తూ బిజీ అయిపోయారు. గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గత కొన్ని నెలల నుంచి ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని రూమర్లు వస్తూ ఉన్నాయి. పెళ్లయి భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న జ్యోతిరాయ్‌ యువ దర్శకుడు సుకు పూర్వాజ్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. త్వరలో అతడ్నే పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి. తాజాగా, జ్యోతిరాయ్‌ తన ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేశారు.

ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫొటో పెట్టారు.  ఆ ఫొటోకు రెండు రింగులను కూడా జతచేశారు. అంతేకాదు! జ్యోతిపూర్వాజ్‌ పేరిట ఓ ఛానల్‌ను కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్టులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంగేజ్‌మెంట్‌ విషయం తెలిసి.. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, జ్యోతిరాయ్‌ కన్నడ, తెలుగు కలిపి 20కిపైగా సీరియళ్లలో నటించారు. కేవలం సీరియల్స్‌లోనే కాదు.. సినిమాల్లోనూ ఆమె నటించారు. తాజాగా, ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్‌గా  ‘ప్రెట్టీ గాళ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. మరి, జ్యోతిరాయ్‌ ఎంగేజ్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom