iDreamPost
android-app
ios-app

ఈమెను గుర్తు పట్టారా? ఫేమస్ తెలుగు సీరియల్ లో మమ్మీ ఈవిడ!

ఈమెను గుర్తు పట్టారా? ఫేమస్ తెలుగు సీరియల్ లో మమ్మీ ఈవిడ!

టీవీలు చూసే వాళ్లందరికీ సంతూర్ యాడ్ బాగా తెలుసు. ఒకావిడ టీచర్ గానో.. ట్రైనర్ గానో ఉంటుంది. ఆమె చాలా యంగ్ గా ఉంటుంది. అయితే సడెన్ గా మమ్మీ అనుకుంటూ ఒక పాప పరిగెత్తుకుంటూ వస్తుంది. అందరూ ఏంటి ఈవిడ మమ్మీనా అని అనుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఈవిడ మమ్మీగా అందరికీ పరిచయం. కానీ, ఆమె ఇన్ స్టాగ్రామ్ పిక్స్ చూస్తే మాత్రం ఏంటి ఈవిడా.. ఆవిడ? అని ముక్కున వేలేసుకుంటారు.

ఇప్పుడు చెప్పుకోబోయేది మరెవరి గురించో కాదులెండి.. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్ర పోషించే జ్యోతి రాయ్ గురించి. అవును మీరు చూసిన మోడ్రన్ ఇమేజ్ కన్నడ నటి జ్యోతి రాయ్ దే. రిషికి అమ్మగా.. మహేంద్ర భూషణ్ కు భార్యగా తెలుగులో ఎంతో అంభిమానులను సొంతం చేసుకుంది. జ్యోతిరాయ్ ని చీరకట్టు, నుదిటిన బొట్టుతో మాత్రమే చాలామంది సీరియల్ ఫ్యాన్స్ చూసుంటారు. ఆమె డ్రెస్సింగ్, చీరలకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

కానీ, ఆఫ్ స్క్రీన్ మాత్రం జ్యోతిరాయ్ అలా అస్సలు ఉండదు. ట్రెండ్ కి తగ్గట్లుగా రెడీ అవుతూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో జ్యోతిరాయ్ పెట్టే ఫొటోలతో కుర్రకారుకు మతిపోతుందనే చెప్పాలి. ఎంతో ఫ్యాషనబుల్ గా, ట్రెండీగా తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అంతేకాకుండా ఆ పిక్స్ కాస్త బోల్డ్ గా కూడా ఉంటూ ఉంటాయి. నిజానికి సీరియల్ లో చూసి ఆమెను అభిమానించే వారికి ఆ పిక్స్ అంతగా నచ్చకపోవచ్చు. నిజానికి సీరియల్ లో 50కి పైబడిన తల్లి పాత్ర చేస్తున్నా కూడా జ్యోతి రావు అసలు వయసు 38 మాత్రమే.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)

కాబట్టి సీరియల్ లో మాదిరిగా బయట కూడా మీరు చీరలు కట్టుకోండి, పెద్ద బొట్టు పెట్టుకోండి అంటే చాలా.. బాగోదు అనే చెప్పాలి. జ్యోతిరాయ్ ఇన్ స్టాగ్రామ్ పిక్స్ అయితే ఫ్యాన్స్ నాటీ కామెంట్స్ కూడా పెడుతుంటారు. మేడమ్ మీరు సీరియల్స్ కాదు.. సినిమాలు చేయాల్సింది. హీరోయిన్ మెటీరియల్ మేడమ్ మీరు అంటూ తెగ పొగిడేస్తుంటారు. జ్యోతిరాయ్ సీరియల్ జగతిగా ఎమోషన్ తో గుండెలు పిండేస్తూ ఉంటుంది. బయట తన ఫ్యాషన్, ట్రెండీ ఫొటోలతో కుర్రకారు గుండెలు పిండేస్తూ ఉంటుంది.

పదేళ్ల క్రితమే కన్యాదానం సీరియల్ తో జ్యోతి రాయ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, గుప్పెడంత మనసు సీరియల్ తో మాత్రం తెలుగు వారికి బాగా దగ్గరైంది. అయితే ఇప్పుడు అంతా హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆమె కన్నడలో హీరోయిన్ చాలానే సినిమాలు చేసింది. అంతేకాకుండా కన్నడలో మాత్రమే కాకుండా.. తుళులో సీరియల్స్ లో కూడా నటించింది.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş