iDreamPost
android-app
ios-app

గుప్పెడంత మనసు జగతి గొప్ప మనసు.. కిన్నెర మొగిలయ్యకు సాయం!

  • Published May 10, 2024 | 6:38 PM Updated Updated May 10, 2024 | 6:38 PM

Jyothi Rai Helped Kinnera Mogilaiah: గుప్పెడంత మనసు సీరియల్ తో కన్నడ భామ జ్యోతిరాయ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ కి దూరమైనా కూడా.. ఒక తెలుగు వాడికి సాయం చేసి మరోసారి తన గొప్ప తనాన్ని చాటుకుంది.

Jyothi Rai Helped Kinnera Mogilaiah: గుప్పెడంత మనసు సీరియల్ తో కన్నడ భామ జ్యోతిరాయ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ కి దూరమైనా కూడా.. ఒక తెలుగు వాడికి సాయం చేసి మరోసారి తన గొప్ప తనాన్ని చాటుకుంది.

  • Published May 10, 2024 | 6:38 PMUpdated May 10, 2024 | 6:38 PM
గుప్పెడంత మనసు జగతి గొప్ప మనసు.. కిన్నెర మొగిలయ్యకు సాయం!

గుప్పెండంత మనసు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన నటి జ్యోతి రాయ్. జ్యోతి అనే పేరు కంటే.. జగతి మేడమ్ అంటేనే గుర్తు పడుతుంటారు. సీరియల్లో చీరకట్టుతో పెద్ద మనిషి తరహాలో హుందాగా కనిపించే ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ రచ్చ చేస్తుందన్న సంగతి విదితమే. ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ చాలా బిజీగా మారిపోయింది. అయితే జ్యోతీరాయ్ ప్రస్తుతానికి తెలుగు బుల్లితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కానీ, అక్షయతృతియ నాడు ఒక తెలుగు వాడికి తనవంతు సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది.

జగతి మేడమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గుప్పెడంత మనసు సీరియల్ తో ఎంతో పాపులర్ అయ్యింది. ఈ కన్నడ భామ ముందు నుంచి ఎంతో ఫేమస్ ఆర్టిస్ట్ అని తెలిసిందే. అయితే గుప్పెడంత మనసు తర్వాత తన కెరీర్ ని మళ్లీ మూవీస్ వైపు మళ్లించింది. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో కూడా సందడి చేస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ అంటే అందరూ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ, జ్యోతిరాయ్ మాత్రం 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం కిన్నెర మొగిలయ్యకు ఆర్థిక సహాయం చేసింది. తన టీమ్ తో మొగిలయ్యను కాంటాక్ట్ అయిన జ్యోతిరాయ్ తాజాగా కలిసి రూ.50 వేలు అందజేసింది.

ఇటీవల కిన్నెర మొగిలయ్య కూలీ పనికి వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అది చూసి చలించిపోయిన జ్యోతి రాయ్ ఆయనకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేసింది. తాను చేస్తున్న ఈ సాయం చాలా చిన్నది అనే విషయం తనకు తెలుసని చెప్పింది. తాను కూడా ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాని.. కానీ, మొగిలయ్య తనకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారని తెలిపింది. అందుకే తనకు తోచిన సాయం చేశానంటూ వెల్లడించింది. సహాయం చేయడమే కాకుండా.. కిన్నెర మొగిలయ్య కాళ్లకు నమస్కరించిం ఆశీర్వాదం కూడా తీసుకుంది. జ్యోతిరాయ్ చేసిన ఈ పనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే ఇటీవల ఈ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో అంటూ.. సోషల్ మీడియాలో కొన్ని దృశ్యాలు చక్కర్లు కొట్టినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని జ్యోతి రాయ్ తీవ్రంగా ఖండించింది. కొందరు పనీ పాటా లేని చిల్లర వెధవలు ఇలాంటి పనులు చేస్తుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పేరిట ఒక వీడియో క్రియేట్ చేసి సర్క్యూలేట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది. తనని కొందరు కావాలనే తొక్కేయాలని చూస్తున్నారని.. తన కెరీర్ ని చీకట్లోకి నెట్టేయాలని చూస్తున్నట్లు విమర్శించింది. తనను ఎంత అణిచి వేయాలని చూసినా.. తాను ఒక ఫీనిక్స్ పక్షిలా తిరిగి వస్తానంటూ చెప్పుకొచ్చింది. కిన్నెర మొగిలయ్యకు జ్యోతిరాయ్ సాయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss