‘గుంటూరు కారం’తో స్టార్ట్ అనుకున్నా.. కాదని క్లారిటీ ఇచ్చారు!

  • Author ajaykrishna Updated - 11:29 AM, Sat - 7 October 23
  • Author ajaykrishna Updated - 11:29 AM, Sat - 7 October 23
‘గుంటూరు కారం’తో స్టార్ట్ అనుకున్నా.. కాదని క్లారిటీ ఇచ్చారు!

ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ఆటోమేటిక్ గా క్రేజ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళ స్టార్డమ్.. ప్రెజెంట్ హిట్ ఫామ్.. ఫ్యాన్ బేస్ దృష్ట్యా సినిమాలకు హైప్ క్రియేట్ అవుతుంది. అదిగాక హీరోలే కాదు.. ఆ సినిమా తీస్తున్న దర్శకులను బట్టి కూడా సినిమా క్రేజ్ మారుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సినిమాలలో ‘గుంటూరు కారం’ ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా సినిమా నుండి పోస్టర్స్, గ్లింప్స్ తప్ప ఏమి రిలీజ్ కాలేదు. అయినా.. త్రివిక్రమ్ పై నమ్మకం ఉంచారు మహేష్ ఫ్యాన్స్.

అందుకు కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న మూడో సినిమా ఇది. అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి గానీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బట్.. ఆ రెండు సినిమాకు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీస్ లిస్టులో ఉంటాయి. అది మహేష్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ మ్యాజిక్. అయితే.. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్.. ఈసారైనా కాంబోలో సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తూనే.. మాస్ అవతారంలో ప్రెజెంట్ చేయనున్నాడు త్రివిక్రమ్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా.. గుంటూరు కారం మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ.. అదేం లేదని తెలుగు భాష వరకే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. దీంతో పాన్ ఇండియా రిలీజ్ కాదా అని ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. ఎందుకంటే.. మహేష్ కి పాన్ ఇండియా వైడ్ ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ గుంటూరు కారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కానీ.. నిర్మాత తేల్చేశాడు కాబట్టి ఏం చేయలేం. మరి మహేష్ పాన్ ఇండియా ఎంట్రీ రాజమౌళి ద్వారానే జరుగుతుందని అర్థమైపోయింది. మరి గుంటూరు కారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments