P Venkatesh
అతడు, ఖలేజా తర్వాత మూడోసారి డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. మూడో రోజు ఎంత వసూలైందంటే?
అతడు, ఖలేజా తర్వాత మూడోసారి డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన మూవీ గుంటూరు కారం. జనవరి 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. మూడో రోజు ఎంత వసూలైందంటే?
P Venkatesh
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ గుంటూరు కారం. మాస్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. స్మార్ట్ గా, స్టైలిష్ లుక్ లో ఉండే మహేష్ మాస్ లుక్ అవతారంలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన రావడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లిన గుంటూరు కారం ఆ తర్వాత ఆ రేంజ్ ఘాటును చూపించలేకపోయింది. కాగా రెండో రోజు ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వచ్చిన మంచి రెస్పాన్స్ తో వీకెండ్ లో కలెక్షన్స్ కాస్త పెరిగాయి. మూడో రోజు గుంటూరు కారం ఎంత వసూలు చేసిందంటే?
గుంటూరు కారం మూవీ విడుదలైన రెండు రోజుల్లో మొత్తం రూ. 127 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు అన్ని సెంటర్స్ కలిపి 94 కోట్లు రాబట్టిన గుంటూరు కారం సినిమా రెండో రోజు 33 కోట్లని కలెక్ట్ చేయడంతో టోటల్ కలెక్షన్స్ 127 కోట్లకు చేరుకున్నాయి. ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 135 కోట్లు కాగా… అందులో 66 కోట్లని రెండు రోజుల్లోనే కలెక్ట్ చేయడంతో గుంటూరు కారం 50% పైనే బిజినెస్ రికవరీ చేసేసింది. మూడో రోజు కూడా గుంటూరు కారం హవా కొనసాగింది. మూడోరోజైన ఆదివారం రూ. 14.25 కోట్లు వసూల్ చేసింది. కాగా 3 డే గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా వసూల్ చేసిన కలెక్షన్లను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ తాజాగా ప్రకటించింది. 164 కోట్లు వసూల్ చేసి దూసుకెళ్తోందని తెలిపారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవ్వడంతో వీకెండ్ లో కలెక్షన్ పెరిగింది.
బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను.. ఫ్లాప్ సినిమా అంటూ ప్రచారం చేసేవారిపై మహేష్ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ మండి పడుతున్నారు. పాజిటీవ్ టాక్ వస్తున్న వేళ కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధా కృష్ణ నిర్మించిన గుంటూరు కారంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రల్లో నటించారు. మనోజ్ పరమహంస, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
రమణగాడి 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗡𝗞𝗥𝗔𝗡𝗧𝗛𝗜 𝗕𝗟𝗢𝗖𝗞𝗕𝗨𝗦𝗧𝗘𝗥 is unstoppable!! 😎🥳#GunturKaaram strikes 𝟏𝟔𝟒 𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 at the worldwide box office in 3 days! 🔥🔥
Watch #BlockbusterGunturKaaram at cinemas near you! 🤩💥🎟️ – https://t.co/78PLl3VD9o
Super 🌟… pic.twitter.com/ZYM8sVEHwf
— Haarika & Hassine Creations (@haarikahassine) January 15, 2024