iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో ధ్యానం చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?

  • Published Nov 09, 2023 | 10:19 AM Updated Updated Nov 09, 2023 | 10:19 AM

సినిమా తారల విషయంలో హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. తమ కిష్టమైన హీరోను లేదా హీరోయిన్‌ను ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. సినిమా తారల విషయంలో గొడవలు జరగటం సర్వ సాధారణం..

సినిమా తారల విషయంలో హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. తమ కిష్టమైన హీరోను లేదా హీరోయిన్‌ను ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేరు. సినిమా తారల విషయంలో గొడవలు జరగటం సర్వ సాధారణం..

  • Published Nov 09, 2023 | 10:19 AMUpdated Nov 09, 2023 | 10:19 AM
ఈ ఫొటోలో ధ్యానం చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?

సినిమా తారలకు అభిమానులు ఉండటం సహజం. అయితే, అందరు సినిమా తారలకు హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ ఉండటం మాత్రం అత్యంత అరుదు. ఈ హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ తమ అభిమాన నటీ,నటులను ప్రాణ ప్రధంగా భావిస్తూ ఉంటారు. హిట్లు, ప్లాపులు, వ్యక్తిగత ఇబ్బందులు, వివాదాలు ఇలా ఏ విషయం కారణంగానూ వారిని వదిలిపెట్టరు. ప్రాణం ఉన్నంత వరకూ వారినే అభిమానిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో హార్డ్‌ కోర్‌ ఫ్యాన్స్‌ కలిగిన అతి తక్కువ మంది స్టార్‌ హీరోయిన్లలో ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్‌ కూడా ఒకరు.

అభిమానులు ఈమెను ఎంతలా అభిమానించారంటే.. ఈమె కోసం ఏకంగా విగ్రహాలు సైతం పెట్టారు. ఈ హీరోయిన్‌ తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. అయితే, మానసిక, శారీరక ఇబ్బందుల కారణంగా ఆమె గత కొన్ని నెలలనుంచి సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. దేశానికి దూరంగా వెళ్లిపోయి జీవిస్తున్నారు. ఆ దేశం, ఈ దేశం అంటూ టూర్లు తిరుగుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.

ఇప్పటికే ఆ హారోయిన్‌ ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. అవును! మీరు ఊహించి నిజమే.. ఆమె స్మైలింగ్‌ క్వీన్‌ సమంత. ఆమె ప్రస్తుతం భూటాన్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడి పకృతి ప్రదేశాల్లో విహరిస్తున్నారు. థింఫూలోని ఓ బౌద్ధ మందిరంలో ద్యానం చేస్తూ ఇలా ఫొటో దిగారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ ఫొటో కాస్తా వైరల్‌గా మారింది. కాగా, సమంత తాజా చిత్రం ‘ ఖుషీ’ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

 ఇక, మైయోసైటిస్‌ చికిత్స కోసం సమంత అమెరికా వెళ్లారు. ఇందుకోసం కొన్ని నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చారు. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినా.. సోషల్‌ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని సినిమా యాడ్స్‌లో కూడా నటిస్తున్నారు. సమంత మైయోసైటిస్‌ నుంచి 90 శాతం కోలుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఆమె కొన్ని ఆరోగ్య నియమాలను పాటిస్తున్నారు.

ఫుడ్‌ డైట్‌, వ్యాయమం విషయాల్లో చాలా కచ్చితంగా ఉంటున్నారు. కొన్ని ఆహార పదార్ధాలను అస్సలు తినటం లేదు. కఠినమైన వ్యాయమాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సమంత ఈ బ్రేక్‌ తర్వాత ఓ హాలీవుడ్‌ సినిమాలో నటించనున్నారు. తమిళం- ఇంగ్లీష్‌ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ‘‘ చెన్నై స్టోరీస్‌’’ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి, సమంత హాలీవుడ్‌ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio