iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌! గుర్తుపట్టారా?

  • Published Jan 04, 2024 | 5:44 PM Updated Updated Jan 04, 2024 | 5:50 PM

సాధారణ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ స్థాయి నుంచి ఇప్పుడు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు.

సాధారణ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ స్థాయి నుంచి ఇప్పుడు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ ఉన్నారు.

  • Published Jan 04, 2024 | 5:44 PMUpdated Jan 04, 2024 | 5:50 PM
ఈ చిన్నారి ఇప్పుడు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌! గుర్తుపట్టారా?

సాధారణంగా హీరోయిన్ల భవిష్యత్తు వారి గ్లామర్‌, సాధించిన విజయాల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ.. ప్లాపులు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ అవకాశాల లేమిని తట్టుకోలేక కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతూ ఉంటారు. కానీ, కొంత మంది మాత్రం అన్నిటినీ తట్టుకుంటూ.. మౌనంగా భరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అదే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తూ ఉంటూ ఉంటుంది. అనుకోని భారీ అవకాశాలు వరిస్తూ ఉంటాయి.

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌. ప్యాన్‌ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావటానికి ముందు చాలా ఇబ్బందులు పడ్డారు. తెలుగులో వరుస ప్లాపులను చవి చూశారు. అయినా వెనక్కు తగ్గలేదు. సరైన అవకాశం కోసం ఎదురు చూశారు. ఆమె ఎదురు చూపు ఫలించింది. ప్యాన్‌ ఇండియా సినిమా ‘ హనుమాన్‌’లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో కాదు.. ‘‘ అమృత అయ్యర్‌’’..

Amrutha Ayyar

అమృత అయ్యర్‌ 2012లో వచ్చిన ‘పద్మవ్యూహం’ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మలయాళంలో వచ్చిన ఈ మూవీలో గుర్తింపులేని పాత్ర చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత 2014లో ‘‘ తెనాలి రామన్‌’’ మూవీలో మంచి పాత్ర చేశారు. తర్వాత వరుసగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రల్లో కనిపించారు. లింగ, యాచన్‌, పోక్కిరి రాజా, పడైవీరన్‌, కాలి, బిగిల్‌ చిత్రాల్లో నటించారు. 2021లో వచ్చిన ‘రెడ్‌’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రామ్‌తో కలిసి నటించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అదే సంవత్సరం ఆమె ‘ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు.

Amrutha Ayyar

ఈ సినిమాలోని ‘ నీలి నీలి ఆకాశం’ పాట ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. పాటతోటే చిత్రానికి మంచి ప్రమోషన్‌ జరిగింది. ప్రస్తుతం ఆమె నటించిన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘హనుమాన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరో తెలుగు మూవీలో ఆమె నటిస్తోంది. ఈ చిత్ర ప్రస్తుతం శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి, హీరోయిన్‌ అమృత అయ్యర్‌ సినీ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş