iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌!

  • Published Jan 11, 2024 | 12:32 PM Updated Updated Jan 11, 2024 | 12:32 PM

హీరోయిన్‌ అయిన తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. తర్వాత మళ్లీ నేరుగా ఏ మూవీలోనూ నటించలేదు. వ్యక్తిగత జీవితం కారణంగా కూడా ఆమె చిక్కుల్లో చిక్కుకున్నారు.

హీరోయిన్‌ అయిన తర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. తర్వాత మళ్లీ నేరుగా ఏ మూవీలోనూ నటించలేదు. వ్యక్తిగత జీవితం కారణంగా కూడా ఆమె చిక్కుల్లో చిక్కుకున్నారు.

  • Published Jan 11, 2024 | 12:32 PMUpdated Jan 11, 2024 | 12:32 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌!

పై ఫొటోలో మీకు కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్‌ హీరోయిన్‌. ఆమెది మన దేశం కాకపోయినా.. భారతదేశపు హీరోయిన్లతో పోటీగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్‌ టు బాలీవుడ్‌ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వ్యక్తిగత జీవితం విషయంలో ఆమెపై చాలా విమర్శలు వస్తూ ఉన్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతోంది. ఓ వైపు హీరోయిన్‌గా.. మరో వైపు తల్లిగా రెండు బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే మీకు ఆ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది.

ఆమె ఇంకెవరో కాదు ప్యాన్‌ ఇండియా హీరోయిన్‌ అమీ జాక్షన్‌. అమీ 2010లో వచ్చిన ‘మద్రాసుపట్టిణం’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో 1920 లవ్‌స్టోరీ పేరుతో విడుదల అయింది. ఇక్కడ కూడా విజయాన్ని సాధించింది. మొదటి మూవీతోటే ఆమెకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2012లో ‘ఏక్‌ దివానా తా’ సినిమా చేశారు. తెలుగులో మొదటి మూవీనే స్టార్‌ హీరోతో చేసింది. రామ్‌ చరణ్‌ నటించిన ‘ ఎవడు’లో ఓ గ్లామరస్‌ పాత్ర చేసింది. తర్వాత తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, హిందీ, కన్నడ భాషల చిత్రాలకే పరిమితం అయ్యారు. 2018లో వచ్చిన ‘బూగీ మ్యాన్‌’ చిత్రంతో ఆమె హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇచ్చారు. అదే సంవత్సరం ఆమె సినిమాలకు దూరం అయ్యారు. ప్రియుడు జార్జ్‌తో కలిసి ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఇద్దరూ 2019 వరకు కలిసి ఉన్నారు. తర్వాత అభిప్రాయ భేధాల కారణంగా విడిపోయింది. ప్రస్తుతం ఆమె ఎడ్‌ వెస్ట్‌ విక్‌ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వటంతో ఆమె పై దేశ వ్యాప్తంగా పలు విమర్శలు వచ్చాయి. వాటిని ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. చాలా కాలం తర్వాత ఆమె తమిళంలో నటించిన మిషన్‌ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి, గ్లోబల్‌ స్టార్‌ అమీ జాక్షన్‌ సినిమా కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş