iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలోని చిన్నారి ఓ స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది!

  • Published Nov 21, 2023 | 9:51 AM Updated Updated Dec 21, 2023 | 6:46 PM

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్‌ కిడ్‌. సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కేవలం 9 సినిమాలతోటే సరిపెట్టుకున్నారు...

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్‌ కిడ్‌. సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొన్నేళ్లకే ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కేవలం 9 సినిమాలతోటే సరిపెట్టుకున్నారు...

  • Published Nov 21, 2023 | 9:51 AMUpdated Dec 21, 2023 | 6:46 PM
ఈ ఫొటోలోని చిన్నారి ఓ స్టార్‌ కిడ్‌.. హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేకపోయింది!

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ కావటం అంత సాధారణ విషయం కాదు. ఇది స్టార్‌ కిడ్స్‌కు కూడా వర్తిస్తుంది. ఎంత పెద్ద స్టార్‌ హీరో, హీరోయిన్‌ పిల్లలైనా ఓ మొదటి సినిమా పరిచయం కోసం మాత్రమే వారి క్రేజ్‌ పనికి వస్తుంది. స్టార్‌ కిడ్స్‌ నటించే సినిమాలు హిట్లు కావాలన్నీ.. ప్లాపులు అవ్వాలన్నా అది ప్రేక్షకుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా స్టార్‌ హీరోయిన్‌ పెద్ద కూతురు. తల్లి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా సూపర్‌ క్రేజ్‌ సంపాదించారు.

కూతురు హీరోయిన్‌గా పరిచయం అవ్వగానే.. తల్లిలా ఈమె కూడా స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని అనుకున్నారు. కానీ, అనుకోని విధంగా ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లకే బయటకు వచ్చేశారు. 10 సినిమాలు కూడా చేయకుండానే  ఇండస్ట్రీకి దూరం అయ్యారు. తాజాగా, పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె ఇంకెవరో కాదు.. ఒకప్పటి అందాల తార రాధ కూతురు కార్తీక నాయర్‌. రాధ కూతురిగా కార్తీక ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అది కూడా ఓ తెలుగు సినిమా ద్వారా.

2009లో వచ్చిన ‘జోష్‌’ అనే చిత్రంతో కార్తీక హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ నాగ చైతన్యకు కూడా మొదటి సినిమా కావటం విశేషం. జోష్‌కు ప్రేక్షకులను మంచి స్పందన రాలేదు. ఇక, 2011లో విడుదలైన కేవీ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘కో’సినిమాతో ఆమె మొదటి విజయాన్ని అందుకున్నారు. కో సినిమా తెలుగులో రంగంగా విడుదలై ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే, కార్తీక సినీ ప్రస్థానం ఎక్కువ ఏళ్లు సాగలేదు. అందం, అభినయం ఉన్నా.. సరైన అవకాశాలు రాలేదు. దీంతో అనుకోని విధంగా సినిమా ఇండస్ట్రీనుంచి బయటకు వెళ్లిపోయారు. 2014లో వచ్చిన ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’ ఆమె నటించిన చివరి తెలుగు సినిమా కాగా.. 2015లో ‘ పురంబోకు అంగిర పుదుఉడమై’ అనే తమిళ సినిమా తర్వాత సినిమాలు చేయటం మానేశారు. సినిమాలకు దూరం అయినప్పటికి రెండేళ్ల తర్వాత హిందీలో ఆరంభ్‌ అనే సీరియల్‌లో నటించారు.

ఆ తర్వాత నటనకు గుడ్‌ బై చెప్పారు. తాజాగా, పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం రోహిత్‌ మీనన్‌ను పెళ్లి చేసుకున్నారు. కేరళలో వీరి పెళ్లి వేడుక అత్యంత ఘనంగా జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి స్టార్లు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. కార్తీక తల్లి సీనియర్‌ నటి రాధ సినీ కొలీగ్స్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి, మేనక, భాగ్యరాజ్‌, భాగ్యరాజ్‌ భార్య తదితరులు హాజరయ్యారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş