iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?.. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది!

  • Published Dec 16, 2023 | 6:01 PM Updated Updated Dec 16, 2023 | 6:01 PM

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌. కేవలం ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ ఉంది.

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌. కేవలం ఒక్క సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ ఉంది.

  • Published Dec 16, 2023 | 6:01 PMUpdated Dec 16, 2023 | 6:01 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?.. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయింది!

బాల్యం జీవితంలో ప్రతిఒక్కరికి మర్చిపోలేని మధుర జ్ఞాపకం. అందుకే చిన్ననాటి జ్ఞాపకాలు చెరిగిపోని అందమైన జ్ఞాపకాలు అంటారు. వీలైనప్పుడల్లా ఆ చిన్ననాటి సంగతులను నెమరు వేసుకుంటూ సంతోషపడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. సినీతారలు వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో.. తమ ఫేవరెట్ యాక్టర్స్ చిన్న నాటి ఫోటోలను చూసిన అభిమానులు క్షణాల్లో వాటిని వైరల్ చేస్తున్నారు.

పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది కదా. కేవలం ఒకే ఒక్క సినిమా.. ఈ అమ్మడుని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. ఇక తన అద్భుతమైన నటనతో యూత్ క్రష్‌గా నిలిచింది. చిన్నతనంలోనే మేకప్ వేసుకుంటున్న ఈ క్యూటీ.. ఇప్పుడు హాట్ బ్యూటీగా ఆకట్టుకుంటోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినిమా ఇండ్రస్టీలో ఒక్క సినిమా హిట్‌ అయితే చాలు స్టార్ హీరో, హీరోయిన్ గా పాపులార్ అవుతారు. ఇక అలాంటి వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. ఒకే ఒక్క సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంతకి ఆమె మరెవరో కాదు.. షాలిని పాండే. అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తు పడతారు అందరు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో.. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. సినిమాలో ప్రీతి పాత్రలో అమాయకపు అమ్మాయిలా అలరించి అందరినీ ఫిదా చేసింది.

కాగా, అర్జున్ రెడ్డి సినిమా తర్వాత.. షాలినికి వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నటన పరంగా అందం, టాలెంట్ అన్నీ ఉన్నా ఈ అమ్మడుకి ఎందుకో పెద్దగా అవకాశాలు రావటం లేదు. ఇక, తమిళ్ లో 100 పర్సెంట్ లవ్ సినిమా రీమేక్ లో నటించింది. మళ్లీ తెలుగులో కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమాలో సావిత్రి ఫ్రెండ్ రోల్‌లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కళ్యణ్ రామ్ సరసన 118 అనే సినిమాలో నటించింది. చివరిగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఇక ,ఈ అమ్మడు తరుచుగా సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మరి, ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom