iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఆ సినిమాతో పిచ్చ పాపులర్‌ అయింది!

  • Published Jan 20, 2024 | 6:33 PM Updated Updated Jan 20, 2024 | 6:33 PM

కేవలం ఒక సినిమాతో ఆమెకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆమె సోషల్‌ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. సోషల్‌ మీడియా ఖాతాలో ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోయారు.

కేవలం ఒక సినిమాతో ఆమెకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆమె సోషల్‌ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. సోషల్‌ మీడియా ఖాతాలో ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోయారు.

  • Published Jan 20, 2024 | 6:33 PMUpdated Jan 20, 2024 | 6:33 PM
ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఆ సినిమాతో పిచ్చ పాపులర్‌ అయింది!

అదృష్టం ఎప్పుడు? ఎవర్ని? ఎలా వరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు చెందిన వారి విషయంలో అదృష్టం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేక అల్లాడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అదృష్టం వరించి ముక్కూ ముఖం తెలియని వాళ్లు కూడా వరల్డ్‌ ఫేమస్‌ అవుతున్నారు. ఆ అదృష్టం సినిమాల రూపంలో వరిస్తూ ఉంటుంది. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా అదృష్టం వరించి ఒకే ఒక్క సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయింది.

అప్పటి వరకు చేసిన సినిమాలు చాలా మందికి తెలియకపోయినా.. ఆ ఒక్క సినిమాలో నటనతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఆ మూవీలో ఆమె చేసింది సెకండ్‌ హీరోయిన్‌ పాత్రే అయినా.. మెయిన్‌ హీరోయిన్‌కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఆమె ఇండియా వ్యాప్తంగా యూత్‌ క్రష్‌ అయిపోయింది. మీకు ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయిపోయి ఉంటుంది. ఆ ఫొటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదు.. యానిమల్‌ సినిమా ఫేమ్‌ తృప్తి దిమ్రీ.

తృప్తి దిమ్రీ 2017లో వచ్చిన మామ్‌ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అదే సంవత్సరం వచ్చిన పోస్టర్‌ బాయ్స్‌తో బాలీవుడ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో లైలా మజ్ను, 2020లో బుల్‌బుల్‌, 2022లో క్వాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. 2023లో వచ్చిన యానిమల్‌ మూవీతో ఆమె దశ తిరిగింది. ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘మేరే మహబూబ్‌ మేరే సనమ్‌, విక్కీ విద్య కా ఓహ్‌ వాలా వీడియో చిత్రాల్లో నటిస్తున్నారు.

యానిమల్‌ సినిమా కారణంగా ఇతర భాషల్లోనూ ఆమెకు అవకాశాలు వస్తున్న సమాచారం. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజం అయితే.. తృప్తి దిమ్రీ సౌత్‌ సినిమాను ఏలుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అందం, అభినయంతో సౌత్‌ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టడం ఖాయం. మరి, తృప్తీ దిమ్రీ సినీ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş