iDreamPost
android-app
ios-app

ఈ కుర్రాడు టాలీవుడ్ నే కాదు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో గుర్తు పట్టారా!

  • Published Apr 10, 2024 | 3:43 PM Updated Updated Apr 10, 2024 | 3:43 PM

Childhood Pic: ఇక్కడ ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిచ్చరపిడుగు విభిన్నమైన పాత్రలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. ఇంతకు ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..

Childhood Pic: ఇక్కడ ఫొటోలో కనిపిస్తోన్న ఈ చిచ్చరపిడుగు విభిన్నమైన పాత్రలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు. ఇంతకు ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..

  • Published Apr 10, 2024 | 3:43 PMUpdated Apr 10, 2024 | 3:43 PM
ఈ కుర్రాడు టాలీవుడ్ నే కాదు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో గుర్తు పట్టారా!

ఈమధ్య కాలంలో చైల్డ్ హుడ్ పిక్ లే ట్రెండ్ అవుతున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి.. వారి చిన్న నాటి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పైన ఉన్న ఫొటో కూడా ఈ కోవకు చెందినదే. ఇక తల్లి చేతిలో ఉన్నాడు కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా.. ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లోనే కాక సౌత్ లో కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ.. తనను తాను నిరూపించుకుంటున్నాడు. మరి ఇంతకు ఈ చిచ్చర పిడుగు ఎవరో గుర్తు పట్టారా.. లేదా అయితే ఇది చదవండి.

పైన ఫొటోలో ఉన్న చిన్నారి.. ఎవరంటే.. విలక్షణ నటుడు నవీన్ చంద్ర. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగాడు నవీన్ చంద్ర. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కథా ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు విలన్ పాత్రల్లోనూ నటిస్తున్నాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా తమిళ్ సినిమాలో కూడా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర.

నవీన్ చంద్ర విషయానికి వస్తే.. ఇతడు మన తెలుగు వాడే. బళ్లారిలోని దేవి నగర్‌లో జన్మించాడు. అతని తండ్రి కర్నాటక రోడ్డు రవాణా సంస్థలో హెడ్ మెకానిక్. స్టడీ విషయానికి వస్తే.. నవీన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కంప్లీట్ చేశాడు. ఇండస్ట్రీకి రాకముందు కొంతకాలం పాటు మల్టీమీడియా యానిమేటర్‌గా పనిచేశాడు.

నవీన్ చంద్ర 2006లోనే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికి.. 2012లో వచ్చిన అందాల రాక్షసి చిత్రం ద్వారా అతడికి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత హీరోగా ఎన్ని సినిమాలు చేసినా.. అవేవి అతడి కెరీర్ కు ఉపయోగపడలేదు. దాంతో నేను లోకల్ సినిమాలో విలన్ ఛాయలు ఉన్న పాత్రలో నటించాడు. అప్పటి నుంచి అతడి కెరీర్ టర్న్ అయ్యింది. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ మూవీలో నవీన్ చంద్ర చేసిన పాత్ర.. అతడి సినీ కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన భానుమతి & రామకృష్ణ మూవీతో హీరోగా మంచి హిట్‌ కొట్టాడు. వీరసింహారెడ్డి చిత్రంలోనూ మంచి పాత్రలో నటించాడు. కొన్ని రోజుల క్రితం హీరోగా మంత్ ఆఫ్ మధు చిత్రం చేశాడు కానీ పెద్దగా వర్కువుట్ అవ్వలేదు. ఇన్‌స్పెక్టర్ రిషితో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ చంద్ర. ఈ సిరీస్ కు అద్భుతమైన ఆదరణ వస్తోంది. దీనిలో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి.. ప్రేక్షకులను మెప్పించాడు. నవీన్ చంద్ర చిన్నప్పుడు తన తల్లితో దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులోని చిన్నోడు.. నవీన్ చంద్ర అంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş