iDreamPost
android-app
ios-app

జిమ్ లో తెగ చెమటోడుస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

  • Published Jul 15, 2024 | 9:04 PM Updated Updated Jul 15, 2024 | 9:04 PM

Guess This Bollywood Actress: జిమ్ములో తెగ చెమటోడుస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుబట్టారా? ఈ అమ్మడికి ఇటీవలే భారీ హిట్టు దొరికింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం తెగ కష్టపడుతోంది.

Guess This Bollywood Actress: జిమ్ములో తెగ చెమటోడుస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుబట్టారా? ఈ అమ్మడికి ఇటీవలే భారీ హిట్టు దొరికింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా కోసం తెగ కష్టపడుతోంది.

  • Published Jul 15, 2024 | 9:04 PMUpdated Jul 15, 2024 | 9:04 PM
జిమ్ లో తెగ చెమటోడుస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

హీరోయిన్ కావడం.. స్టార్డమ్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఒక్కోసారి ఏళ్ల తరబడి కష్టపడ్డా కూడా ఫలితాలు దక్కవు. కానీ, కొందరికి మాత్రం వారి టాలెంట్ కి తగ్గట్లు చాలా తక్కువ సమయంలోనే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా రావడమే కాదు.. అవి సక్సెస్ అయ్యి మంచి ట్రాక్ లోకి కూడా వచ్చేస్తారు. ఈ బ్యూటీ కూడా ఇప్పుడు అదే ఫేజ్ లో ఉంది. ప్రస్తుతం తన సినిమా ఇచ్చిన కిక్ ని ఎంజాయ్ చేస్తోంది. కానీ, హెల్త్ ని మాత్రం అస్సలు నెగ్ లెక్ట్ చేయడం లేదు. మండే మోటివేషన్ అంటూ జిమ్ లో కసరత్తులు చేస్తోంది. అలా చేయడం మాత్రమే కాదండోయ్.. తన ఫ్యాన్స్ కూడా ఆరోగ్యంగా ఉండేలా మోటివేట్ చేస్తోంది.

సాధారణంగానే ఒక సక్సెస్ రాగానే తారాగణం కాస్త వెకేషన్ కి వెళ్లడం, పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. కానీ, ఈ అమ్మడు మాత్రం తన సినిమా రూ.100 కోట్లు దాటేసినా కూడా ఏమాత్రం గర్వం లేకుండా.. తర్వాత ప్రాజెక్టుల కోసం తెగ కష్టపడుతోంది. తాను నెక్ట్స్ ఒక స్పై థ్రిల్లర్ సినిమాలో చేస్తోంది. అందుకు సంబంధించి బాడీ ట్రాన్సఫర్మేషన్ కోసం కష్ట పడుతోంది. ఒక ఏజెంట్ మాదిరి తాను కనిపించబోతోంది. అది కూడా ఒక పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సరసన. ఒక లేడీ మల్టీ స్టారర్ అనమాట. ఇప్పుడు ఈ అమ్మడు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏంటి.. ఇంకా ఆ భామ ఎవరో గుర్తుపట్టలేదా?

ఈ అమ్మడు.. బాలీవుడ్ బ్యూటీ మరెవరో కాదు.. ముంజ్యా సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న శర్వరీ. ఈమె ప్రస్తుతం ముంజ్యా సక్సెస్ నుంచి బయటకు వచ్చేసి.. ఆల్ఫా పనుల్లో మునిగిపోయింది. ప్రస్తుతం జిమ్ లో కసరత్తులు చేస్తూ బాగా కష్టపడుతోంది. ఆల్ఫా సినిమా ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అలియా భట్ తో పాటుగా యష్ రాజ్ ఫిల్మ్స్.. స్పై యూనివర్స్ లో శర్వారీ కూడా ఒక భాగం అయ్యింది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినిమా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడుకి ఇప్పుడు హీరోయిన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ ఆల్ఫా కూడా హిట్టు కొడితే ఇంక ఈమెకు బాలీవుడ్ లో లక్కీ లేడీ అనే బిరుదు వచ్చేస్తుంది. అయిత్ అంతకంటే ముందే.. ఆగస్టు 15న శర్వారీ నటించి వేదా చిత్రం విడుదల కాబోతోంది. ఆ సినిమా రిజల్ట్ ఈమె కెరీర్, తదుపరి ప్రాజెక్టుల మీద కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మార్నింగ్ మోటివేషన్ అంటూ తన ఫాలోవర్స్ ని మోటివేట్ చేస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş