iDreamPost
android-app
ios-app

రెండో సినిమాకే 100 కోట్లు.. ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

  • Published Jul 03, 2024 | 8:21 PM Updated Updated Jul 03, 2024 | 8:21 PM

Guess This Actress- Who Recently Got 100 Crore: సినిమాల్లో సక్సెస్ అనేది ఎవరికీ ఊరికే రాదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా కాస్తో కూస్తో లక్ ఉండాల్సిందే. ఈ అమ్మడుకి ఆ లక్ కూసింత ఎక్కువే ఉంది. ఎవరో గుర్తు పట్టారా?

Guess This Actress- Who Recently Got 100 Crore: సినిమాల్లో సక్సెస్ అనేది ఎవరికీ ఊరికే రాదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా కాస్తో కూస్తో లక్ ఉండాల్సిందే. ఈ అమ్మడుకి ఆ లక్ కూసింత ఎక్కువే ఉంది. ఎవరో గుర్తు పట్టారా?

  • Published Jul 03, 2024 | 8:21 PMUpdated Jul 03, 2024 | 8:21 PM
రెండో సినిమాకే 100 కోట్లు.. ఈ బ్యూటీని గుర్తు పట్టారా?

ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. బయటి నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ, అక్కడ ఉండే లోటుపాట్లు, ఒడిదొడుకులు లోపల ఉన్నవారికే తెలుస్తాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత తేలిక కాదు. కొందరికి కొన్నేళ్లు ప్రయత్నించినా కూడా అది అందని ద్రాక్షగానే ఉంటుంది. కానీ, కొందరికి మాత్రం అది చాలా త్వరగా దక్కుతుంది. అలాగే ఒక టెక్నీషియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్లుగా మారిపోయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటి లిస్టులోకి ఈ బ్యూటీ కూడా చేరుతుంది. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు నటిగా మారింది. అంతేకాందండోయ్.. రెండో సినిమాకే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. మరి.. ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?

సాధారణంగా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు అనగానే అందరికీ తెలుగులో ఉన్న న్యాచురల్ స్టార్ నానీనే గుర్తొస్తాడు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ గా తన కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అద్భుతమైన సినిమాలతో హీరోగానే కాకుండా.. ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఈ నటి కూడా మొదట తన కెరీర్ ని అసిస్టెంట్ డైరెక్టర్ గానే కొనసాగిచింది. ఆ తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇప్పుడు రెండు సినిమాలతోనే లక్కీ తారగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంది. ఆమె నటించిన ఒక చిన్న చిత్రం ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇంతకీ ఆమెను ఇప్పటికైనా గుర్తు పట్టారా? లేదా?

ఆ నటి మరెవరో కాదు.. శార్వరీ వాఘ్. ఈమె కూడా ఇలాంటి కోవకే చెందుతుంది. అటు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా మంచి విజయాలు అందుకుంది. అలాగే ఇటు నటిగా కూడా చాలా మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ప్యార్ కా పంచనామా, బాజీరావ్ మస్తానీ, సోను కి టిటు కి స్వీటి వంటి బాలీవుడ్ చిత్రాలకు శార్వరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ తర్వాత శార్వరీ బంటీ ఔర్ బబ్లీ 2 చిత్రంతో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత కేవలం రెండో ప్రయత్నంలోనే అద్భుతమైన ఫలితాన్ని అందుకుంది.

ఇటీవల వచ్చిన బాలీవుడ్ హారర్ కామెడీ చిత్రం ముంజ్యాలో నటించింది. ఒక చిన్న సినిమాగా ఈ ముంజ్యా వచ్చింది. నిజానికి మొదట ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పుడు ముంజ్యా మూవీ ఏకంగా రూ.118.51 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ అమ్మడు నెక్ట్స్ వేదా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అది కూడా ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆ మూవీలో హీరోగా జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. ప్రస్తుతం శార్వరీ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetcio