iDreamPost
android-app
ios-app

రూ. 200 కోట్ల కలెక్షన్స్ తో రీసెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

  • Author ajaykrishna Published - 04:17 PM, Fri - 11 August 23
  • Author ajaykrishna Published - 04:17 PM, Fri - 11 August 23
రూ. 200 కోట్ల కలెక్షన్స్ తో రీసెంట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో నార్మల్ గా నిలదొక్కుకోవడమే చాలా కష్టమని చెబుతుంటారు. అలాంటిది అసలు ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు, బ్యాక్గ్రౌండ్ లేని ఓ కుర్రాడు.. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి.. ఆడిషన్స్ లో పాల్గొని ఆఖరికి ఓ సినిమా ఛాన్స్ వస్తే.. ఆ ఆకలి ఎలా ఉంటుందో తెలుసా! అసలే చీకటి.. రోడ్డు నిండా గతుకులు.. అన్నట్లుగా సాగుతున్న లైఫ్ లో ఒక్కసారిగా హీరో అనే వెలుగు వెలిగింది. హీరో కాకముందే ఇండస్ట్రీలో ఎలాగైనా సెట్ అవ్వాలని.. ఇక్కడే తన కెరీర్ అని ఫిక్స్ అయి వచ్చాడు. పైన ఫోటోలో పిల్లాడిని గుర్తుపట్టారా..? మనం చెప్పుకుంటుంది అతని గురించే. ఇప్పుడు అతనో స్టార్ హీరో. జీరో నుండి ఆకాశానికి ఎదిగాడు.

డ్రీమ్స్ కి తోడుగా హార్డ్ వర్క్ ఉంటే.. వాటికి తోడు లక్ష్యంపై నమ్మకం ఉంటే సాధించలేనిది ఏది లేదని చేసి చూపించాడు. కట్ చేస్తే.. బెస్ట్ యాక్టర్ డెబ్యూ సినిమాకే అవార్డు అందుకున్నాడు.. హీరో అవ్వకముందే యాడ్ ఫిలిమ్స్ కి, మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఇలా కాదని చెప్పి.. అవన్నీ పక్కన పెట్టేసి.. ఆడిషన్స్ లో పాల్గొని హీరో ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. సరిగ్గా గమనిస్తే అతను ఎవరో ఇట్టే కనిపెట్టగలరు. కానీ.. తెలుగు వరకే ఆలోచిస్తే దొరకడు. ఇతని డెబ్యూ మూవీ తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. మరో క్లూ ఏంటంటే.. రీసెంట్ గా ఇతని సినిమా.. రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. అందులో హీరోయిన్ కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు.

పై ఫోటోలో కళ్లద్దాలు పెట్టుకొని.. చేతిలో గన్ పట్టుకొని అల్లరి చేస్తున్న పిల్లాడు ఎవరంటే.. బెస్ట్ పెర్ఫార్మర్ గా అతనికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. అలాగే అతనితో కలిసి వర్క్ చేయాలనీ అన్ని ఇండస్ట్రీల హీరోయిన్స్ ఆరాటపడుతుంటారు. మరో విషయం ఏంటంటే.. అతనికి ఆల్రెడీ ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లి అయిపోయింది. తన వైఫ్ తో సుమారు మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు.. అదికూడా ఒకే డైరెక్టర్ కాంబినేషన్ లో.. ఎవరో గుర్తుకు వచ్చిందా? బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే భర్త. ఇటీవల అలియా భట్ తో చేసిన ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కథ’ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూల్ చేసింది. ఇక రన్వీర్ ఫస్ట్ మూవీ.. బ్యాండ్ బాజా భారాత్ తెలుగులో ఆహా కళ్యాణంగా రీమేక్ అయ్యింది. కాగా.. ప్రస్తుతం రన్వీర్ చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ హీరో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

did you remember that star hero 1

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş