iDreamPost
android-app
ios-app

ఎంతో పద్దతిగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హైఓల్ట్‌ బోల్డ్‌నెస్‌తో రచ్చ చేస్తోంది

  • Published Apr 26, 2024 | 1:47 PM Updated Updated Apr 26, 2024 | 1:47 PM

కొందరు సెలబ్రిటీల పాత ఫొటోలు.. ప్రస్తుతం వారి పిక్‌లు చూస్తే.. అరే వీరేనా.. అప్పట్లో ఇలా ఉండేవారా.. అస్సలు గుర్తు పట్టలేకపోయాం అని అనిపిస్తుంది. పైన కనిపిస్తోన్న ఫొటో కూడా అలాంటిదే. ఇంతకు ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా..

కొందరు సెలబ్రిటీల పాత ఫొటోలు.. ప్రస్తుతం వారి పిక్‌లు చూస్తే.. అరే వీరేనా.. అప్పట్లో ఇలా ఉండేవారా.. అస్సలు గుర్తు పట్టలేకపోయాం అని అనిపిస్తుంది. పైన కనిపిస్తోన్న ఫొటో కూడా అలాంటిదే. ఇంతకు ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా..

  • Published Apr 26, 2024 | 1:47 PMUpdated Apr 26, 2024 | 1:47 PM
ఎంతో పద్దతిగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హైఓల్ట్‌ బోల్డ్‌నెస్‌తో రచ్చ చేస్తోంది

ఓ 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా ఆడపిల్ల అంటే కాస్త బొద్దుగా ఉండాలని భావించేవారు. అప్పట్లో సినిమా హీరోయిన్లు కూడా ఇలానే నిండైన రూపం కలిగి ఉండేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది మనిషి ఆలోచన విధానం మారిపోయింది. ఆడపిల్లకు సంబంధించి ఆంక్షలు, కొలతలు తెర మీదకు వచ్చాయి. సినిమా ప్రపంచంలో ఇవి మరీ మితిమీరి పోయాయి. హీరోయిన్లు ఏమాత్రం బొద్దుగా ఉన్నా సరే.. పక్కకు పట్టేవారు. ఆమెకు అవకాశాలు కూడా ఇచ్చేవారు కాదు. పైగా ఆమె శరీర సౌష్టవంపై కామెంట్స్‌ చేసేవారు. కొందరైతే.. ఆయా భాగాలకు సర్జరీలు చేయించుకోమని సూచించేవారు. ఇక సినిమా లోకంలో ఇలా సర్జరీలు చేయించుకున్న తారలు ఎందరో ఉన్నారు.

నాటి శ్రీదేవి మొదలు.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్ల వరకు చాలా మంది తన శరీరంలోని ఆయా భాగాలకు సర్జరీలు చేయించుకున్నవారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా.. ముద్దుగా ఉన్న భామలు సైతం.. కొన్నాళ్ల తర్వాత జీరో సైజ్‌కు మారిపోయారు. ఇక పైన ఫొటోలో మీరు చూసిన బొద్దుగుమ్మ కూడ ఈ కోవలోకే వస్తుంది. బుల్లితెర హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేసే గ్లామర్‌ ఫొటోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. ఇంతకు ఈ బొద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.. లేదా..

పైన ఫొటోలోని బొద్దుగుమ్మ.. ఎవరంటే.. ఇప్పుడు గ్లామర్‌ ప్రపంచంలో రాణిస్తోన్న మౌనీ రాయ్‌. ఈ బాలీవుడ్‌ నటి.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. నాగిని సీరియల్‌ ద్వారా.. తెలుగులో కూడా బాగా పాపులర్‌ అయ్యింది. ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యుమ్కీ సాస్ భీ కభీ బహు థీ’తో బాలీవుడ్‌ బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది మౌనీ రాయ్‌. ఆ తర్వాత కస్తూరి, దో సహేలియన్, దేవోమ్ కా దేవ్ మహాదేవ్, జునూన్ వంటి సీరియల్స్‌లో నటించింది. కానీ నాగిన్‌ సీరియల్‌ మాత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సీరియల్‌ దక్షిణాది అన్ని భాషల్లోకి డబ్‌ అవ్వడంతో.. బాలీవుడ్‌తో పాటు ఇక్కడి వారికి కూడా చేరువయ్యింది ఈ బ్యూటీ.

సీరియల్స్‌లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఆమెకు సినీ అవకాశాలు వచ్చాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’ చిత్రంతో మౌని బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. కేజీఎఫ్ హిందీ రీమేక్‌లో ‘గాలి గాలి’ అనే పాటలో మెరిసింది. అలాగే రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది. ఇక మూవీల సంగతి పక్కకు పెడితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ఫుల్‌ యాక్టీవ్‌. ఈమె పోస్ట్‌ చేసే గ్లామర్‌ ఫొటోలకి.. కుర్రాళ్లకు మతి పోతుంది. బోల్డ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది మౌనీ రాయ్‌.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. కేరళకు చెందిన సూరజ్ నంబియార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది మౌనీరాయ్. అతడు దుబాయ్‌లో బ్యాంకర్‌గా పని చేస్తున్నాడు. దాంతో ఈ భామ తరచుగా దుబాయ్‌ వెళ్తుంటుంది. ఇక ఇప్పుడు మౌని పాత ఫొటోలు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు.. అప్పటి కంటే ఇప్పుడే మరింత అందంగా మారిపోయి కనిపిస్తుంది. సర్జరీ తర్వాత అసలు గుర్తుపట్టలేని విధంగా అందంగా మారిపోయింది అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss