iDreamPost
android-app
ios-app

మెడల్‌ అందుకుంటున్న ఈ కుర్రాడు.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. గుర్తు పట్టారా?

  • Published Feb 08, 2024 | 2:36 PM Updated Updated Feb 08, 2024 | 2:36 PM

Sudheer Babu: పైన ఫొటోలో మెడల్ అందుకుంటున్న కుర్రాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరో మాత్రమే కాక.. ఓ స్టార్‌ హీరోకి బంధువు కూడా. ఇంతకు తను ఎవరో గుర్తుపట్టారా..

Sudheer Babu: పైన ఫొటోలో మెడల్ అందుకుంటున్న కుర్రాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరో మాత్రమే కాక.. ఓ స్టార్‌ హీరోకి బంధువు కూడా. ఇంతకు తను ఎవరో గుర్తుపట్టారా..

  • Published Feb 08, 2024 | 2:36 PMUpdated Feb 08, 2024 | 2:36 PM
మెడల్‌ అందుకుంటున్న ఈ కుర్రాడు.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. గుర్తు పట్టారా?

ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో చైల్డ్‌హుడ్‌ పిక్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ చిన్ననాటి ఫొటోలను షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు తామే స్వయంగా తన చిన్ననాటి చిత్రాలను షేర్‌ చేస్తుండగా.. మరి కొందరి ఫొటోలను వారి అభిమానులు షేర్‌ చేస్తున్నారు. ఎవరు షేర్‌ చేశారు అన్నదానితో సంబంధం లేకుండా.. ఆ ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి. ఇప్పుడు మీరు పైన చూస్తోన్న ఫొటో కూడా ఓ స్టార్‌ హీరోదే. మెడల్‌ అందుకుంటున్న ఆ కుర్రాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోగా రాణిస్తున్నాడు. విభిన్న పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పైగా అతడు హీరో మాత్రమే కాక.. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌కు బంధువు. మరి ఇంతకు ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.

పైన ఫొటోలో ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. లేదా.. అయితే మేమే చెప్తాము వినండి. అతడు మరేవరో కాదు.. దివంగత హీరో, సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు. మామ, బావ ఇద్దరూ సూపర్‌ స్టార్లు అయినా.. వారి క్రేజ్‌, పేరు వాడుకోకుండానే.. నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులను మెప్పించాడు. సుధీర్‌ బాబు.. కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని భర్త. 2010లో నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఏ మాయ చేసావే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో సమంత సోదరుడి పాత్రలో నటించాడు.

ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాలో హీరోగా యాక్ట్‌ చేశాడు సుధీర్‌ బాబు. ఈ సినిమా విజయం సాధించడంతో.. ఆపై వరుసపెట్టి చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో మోసగాళ్లకు మోసగాడు, నన్ను దోచుకుందవటే సినిమాల్లో కనిపించాడు. ఇటీవలే మామ మశ్చింద్ర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సుధీర్‌ బాబు. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న సుధీర్‌ బాబు.. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్. అతను ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. ఒకసారి డబుల్స్ భాగస్వామిగా పుల్లెల గోపీచంద్‌తో కలిసి బ్యాడ్మింటన్‌ ఆడాడు. అప్పట్లో బ్యాడ్మింటన్ రన్నరప్ మెడల్ అందుకుంటున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అలాగే క్రికెట్‌ ప్లేయర్‌ కూడా.

ఇక ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సుధీర్ బాబు. ఆ సమయంలో తన కొడుకు చరిత్ మానస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. మరో రెండుమూడేళ్లలో తన కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని.. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలిపాడు. చరిత్ మానస్ చూడటానికి అచ్చం మహేష్ బాబులాగే కనిపిస్తాడు. అతడి ఫొటోలు అప్పట్లో తెగ వైరల్‌ అయ్యాయి. అచ్చం మేనమామలానే ఉన్నాడంటూ కామెంట్స్‌ చేశారు నెటిజనులు.

 

View this post on Instagram

 

A post shared by Sudheer Babu (@isudheerbabu)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş