iDreamPost
android-app
ios-app

గోపాల గోపాల మూవీలో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా..? ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Aug 16, 2024 | 3:29 PM Updated Updated Aug 16, 2024 | 3:29 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన మూవీ గోపాల గోపాల. ఇందులో మిధున్ చక్రవర్తి దగ్గర శిష్యురాలిగా నటించిన పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- విక్టరీ వెంకటేశ్ కాంబోలో వచ్చిన మూవీ గోపాల గోపాల. ఇందులో మిధున్ చక్రవర్తి దగ్గర శిష్యురాలిగా నటించిన పేరు తెచ్చుకున్న యాక్ట్రెస్ గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా...?

  • Published Aug 16, 2024 | 3:29 PMUpdated Aug 16, 2024 | 3:29 PM
గోపాల గోపాల మూవీలో నటించిన ఈ నటిని గుర్తుపట్టారా..? ఇప్పుడెలా ఉందంటే..?

ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాలకు తిరిగి ఆద్యం పోసిన నటుడు విక్టరీ వెంకటేశ్. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టుతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడంతో మల్టీస్టారర్ చిత్రాలు ఊపందుకున్నాయి. ఆ వెంటనే రామ్‌తో మసాలా వచ్చింది. మరో రెండేళ్లకు వచ్చిన మూవీ గోపాల గోపాల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వెంకీ నటించిన ఈ చిత్రం 2015 సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకుంది. హిందీ ఓ మైగాడ్ మూవీకి రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సురేష్ బాబు, శరత్ మరార్ నటించారు. కిషోర్ కుమార్ పార్దసాని దర్శకుడు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ మూవీలో మిధున్ చక్రవర్తి శిష్యురాలిగా యాక్ట్ చేసిన నటి గుర్తుందా..? ఈ మూవీతోనే క్లిక్ అయిన నటి ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

గోపాల గోపాల మూవీలో గోపికా మాతగా నటించింది దీక్షా పంత్. 2010 మూవీలో వరుడు మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దీక్షా.  వరుస సినిమాలు చేసింది కానీ లక్ కలిసి రాలేదు. 2017లో బిగ్ బాస్ తొలి సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె ఫేట్ మారలేదు. 2018 నుండి సినిమాలో కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వెంకటేశ్, నాగార్జున, నాగ చైతన్య, నిఖిల్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది కానీ..స్టార్ డమ్ తీసుకురాలేకపోయాయి. అందం, అభినయం ఉన్నా స్టార్ హీరోయిన్ను చేయలేకపోయాయి. హీరోయిన్‌గా కొన్ని అవకాశాలు వచ్చాయి.. కానీ మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని గుర్తింపు లేని దక్కని సినిమాల్లో యాక్ట్ చేసింది.

Gopala Gopala Actress 1

ఆమె నటించిన చిత్రాల్లో కాస్తంత గుర్తింపు తెచ్చినవీ.. రచ్చ, వరుడు, సోగ్గాడే చిన్ని నాయనా, ఒక లైలా కోసం. మయా మహాల్ మూవీలో యాక్ట్ చేసింది. నిఖిల సిద్దార్థ శంకరాభరణంలో క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఇన్ స్టా, జోష్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై తన హవా కొనసాగిస్తుంది దీక్షా పంత్. అయితే ఆమెకు గుర్తింపు నిచ్చిన చిత్రం మాత్రం గోపాల గోపాల. 2017లో తొలి బిగ్ బాస్ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. సుమారు 63 రోజుల పాటు ఇంట్లో ఉండి ఆకట్టుకుంది. ఆరవ ప్లేసుతో సరిపెట్టుకుంది. 2018లో ఆపరేషన్ 2019 మూవీ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎంటర్ ప్రెన్యూయర్ గా మారినట్లు ఆమె ఇన్ స్టా ఖాతాను బట్టి తెలుస్తుంది. చాలా మంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో అంత గుర్తింపు రాకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన వాళ్లు ఉన్నారు. మళ్లీ ఈ భామ తెలుగు తెరపై రాణించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Diksha Pantth (@dikshapanth)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom