iDreamPost
android-app
ios-app

ఘనంగా పెళ్లి చేసుకున్న గుడ్ నైట్ హీరోయిన్.. మీతా రఘునాథ్

  • Published Mar 18, 2024 | 9:22 AM Updated Updated Mar 18, 2024 | 11:45 AM

Meetha Raghunath : గుడ్ నైట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి కుర్రాళ్ల మనసు దోచేసిన మీతా రఘునాథన్ తాజాగా తన బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి పలుకుతూ ఇంట్రెస్టింగ్ ఫోటోస్ ను షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

Meetha Raghunath : గుడ్ నైట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి కుర్రాళ్ల మనసు దోచేసిన మీతా రఘునాథన్ తాజాగా తన బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి పలుకుతూ ఇంట్రెస్టింగ్ ఫోటోస్ ను షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Mar 18, 2024 | 9:22 AMUpdated Mar 18, 2024 | 11:45 AM
ఘనంగా పెళ్లి చేసుకున్న గుడ్ నైట్ హీరోయిన్.. మీతా రఘునాథ్

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్న తారాలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో తమిళ్ యంగ్ హీరోయిన్ ‘మీతా రఘునాథ్’ కూడా ఒకరు. ఈమె ‘గుడ్ నైట్’ సినిమాలో తన నటనతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. పైగా భాషతో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన చిన్న సినిమాలో అను అనే పాత్రలో నేచురల్ బ్యూటీగా నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మీతాకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్న నేపథ్యంలో.. ఆమె పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవలే మీతా నిశ్చితార్ధం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే మీతా కూడా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే ఈమధ్యనే నిశ్చితార్ధం చేసుకున్న ఈ చిన్నది తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కాగా, నిన్న(ఆదివారం మార్చి 17న) మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో ఏడడుగులు వేశారు. ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమక్షంలో మీతా వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఆ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను మీతా తన ఇన్ స్టాగ్రామ్ షేర్ చేశారు. దీంతో ఈ పోటోస్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన ఆమె అభిమానులు మీతాకు పెద్ద ఎత్తునే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Good night heroine into marriage

ఇక మీతా రఘునాథన్ ‘ముత్తుల నీ నిధూమ్ నీ’ అనే సినిమాతో తమిళ చిత్రసీమతో వెండితెర పై ఎంట్రీ ఇచ్చారు. అయితే తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ అందాల భామ. కాగా, సినిమాల్లో తన నటనతో ఎంతో ఆద్భుతంగా నటించి తన బ్యూటీఫుల్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు మీతా. ఇక గతేడాది గుడ్ నైట్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యిన మీతా ఓవర్ నైట్ స్టార్ గా మారారు. అలా ఈ బ్యూటీ చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో పాటు.. వరుస అవకాశాలను అందుకుంటున్నారు. మరి, బ్యాచలర్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ కు అడుగు పెట్టిన మీతా రఘునాథ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.