iDreamPost
android-app
ios-app

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్పిరిట్‌నుంచి బిగ్‌ అప్‌డేట్‌!

  • Published Jan 21, 2024 | 6:25 PM Updated Updated Jan 21, 2024 | 6:25 PM

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ‘స్పిరిట్‌’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఓ బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

  • Published Jan 21, 2024 | 6:25 PMUpdated Jan 21, 2024 | 6:25 PM
ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. స్పిరిట్‌నుంచి బిగ్‌ అప్‌డేట్‌!

యానిమల్‌ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్‌ రెడ్డి వంగా. రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా, అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, తృప్తి దిమ్రీ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. డిసెంబర్‌ 1వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ విడుదల అయింది. ఇప్పటి వరకు 900 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక, అసలు విషయానికి వస్తే.. సందీప్‌ – ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి ‘స్పిరిట్‌’ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఇందులో ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్‌ యానిమల్‌ 2 విడుదల అయిన తర్వాత ఉంటుందని అందరూ భావించారు. కానీ, యానిమల్‌ 2 కంటే ముందే స్పిరిట్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పుడు టాలీవుడ్‌ సర్కిల్‌లో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్పిరిట్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.

కథకు సంబంధించిన పని జరుగుతోందని కూడా చెప్పారు. ఆయన ఈ మాటలు అన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, స్పిరిట్‌ అప్‌డేట్‌ గురించి తెలిసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా, సందీప్‌ రెడ్డి అర్జున్‌ రెడ్డి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ మూవీ తెలుగునాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు! ఇతర భాషల్లో కూడా రీమేక్‌ అయింది. అర్జున్‌ రెడ్డిని హిందీలో కబీర్‌సింగ్‌గా రీమేక్‌ చేశారు.

స్వయంగా సందీప్‌రెడ్డినే ఇందుకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ హిందీలో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా సూపర్‌ అనిపించుకుంది. సందీప్‌కు మంచి పేరు వచ్చింది. తర్వాతి మూవీ యానిమల్‌తో రికార్డులు సృష్టించారు సందీప్‌. యానిమల్‌ 2పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి, స్పిరిట్‌ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss