iDreamPost
android-app
ios-app

మేం గుళ్లో పెళ్లి చేసుకున్నాం.. నన్ను వదిలించుకునేందుకు డ్రగ్స్‌ కేసులో: రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు

  • Published Jul 05, 2024 | 1:41 PM Updated Updated Jul 05, 2024 | 1:41 PM

నటుడు రాజ్ తరుణ్ పై ఆమె ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. 11 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్ షిప్‌లో ఉన్నామని, గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఇప్పుడు తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..?

నటుడు రాజ్ తరుణ్ పై ఆమె ప్రియురాలు లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. 11 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్ షిప్‌లో ఉన్నామని, గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఇప్పుడు తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..?

  • Published Jul 05, 2024 | 1:41 PMUpdated Jul 05, 2024 | 1:41 PM
మేం గుళ్లో పెళ్లి చేసుకున్నాం.. నన్ను వదిలించుకునేందుకు డ్రగ్స్‌ కేసులో: రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు

యంగ్ హీరో రాజ్ తరుణ్ తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు లేడు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ.. నటనతో ఆకట్టుకున్నాడు. ఉయ్యాలా జంపాల మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజ్.. అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. హీరోగా మారాడు. తొలి మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి.. హీరో ఉదయ్ కిరణ్‌ను తలపించాడు. అయితే ఆ తర్వాత కథల ఎంపికలో తడబడ్డాడు. మళ్లీ ఫేమ్ కోసం ఆరాటపడుతున్నారు. ఈ ఏడాది నా సామి రంగాతో పలకరించిన రాజ్ తరుణ్.. తిరగబడరా సామి, భలే ఉన్నాడే వంటి చిత్రాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ యంగ్ హీరోపై లావణ్య అనే అమ్మాయి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. 2012 నుండి అంటే 11 ఏళ్లుగా తామిద్దరం రిలేషన్ షిప్‌లో ఉన్నామని, గుడిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది. దానికి సంబంధించిన ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసింది. తనను అఫీషియల్‌గా పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చీట్ చేశాడని తెలిపింది. రాజ్ తరుణ్ తిరగబడారా సామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడని, అందుకే తనను వదిలేశాడంటూ చెబుతోంది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే.. ‘ఆ హీరోయిన్ ప్రేమలో పడి.. 3 నెలల క్రితం ఇంటి నుండి దూరంగా వెళ్లిపోయి ఆమెతో ఉంటున్నాడు. అతడ్ని వదిలేయకపోతే చంపేస్తామంటూ హీరోయిన్ మాల్వీ, ఆమె సోదరుడు నన్ను బెదిరించారు. చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు’ అని పేర్కొంది.

అంతేకాకుండా తనను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారని, మూడు నెలల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. ‘ 2012 నుండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా కలిశాం. కానీ మాల్వీతో ఎఫైర్ పెట్టుకునేంత వరకు బాగానే ఉన్నాం. అతడ్ని కలవడానికి ఆమె తరుచుగా హైదరాబాద్ వస్తూ ఉండేది. అలాగే అతడు కూడా మంబయి వెళుతూ ఉండేవాడు. ఇద్దరు కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి వెళ్లేవారు. నాకు తెలిసి ప్రశ్నించే సరికి నన్ను దూరం పెట్టడం స్టార్ చేశాడు. వీరికి అడ్డువస్తున్నానని తెలిసి డ్రగ్ కేసులో ఇరికించాడు. 45 రోజుల పాటు జైలులో ఉన్నా. అప్పుడు కూడా నాకు సాయం చేయలేదు. కావాలని నన్ను ఈకేసులో ఇరికించేలా చేశాడు రాజ్ తరుణ్’ అంటూ ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని చెప్పడం గమనార్హం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom