iDreamPost
android-app
ios-app

జార్జి రెడ్డిలోని బుల్లెట్ సాంగ్‌లో కనిపించిన ఈ నటి.. ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Aug 17, 2024 | 3:25 PM Updated Updated Aug 17, 2024 | 3:25 PM

నిజ జీవితాల కథ ఆధారంగా ఇటీవల కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వాటిల్లో ఒకటి జార్జిరెడ్డి. స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బుల్లెట్ సాంగ్. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే.?

నిజ జీవితాల కథ ఆధారంగా ఇటీవల కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వాటిల్లో ఒకటి జార్జిరెడ్డి. స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బుల్లెట్ సాంగ్. ఇందులో తన నటనతో ఆకట్టుకున్న అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందంటే.?

  • Published Aug 17, 2024 | 3:25 PMUpdated Aug 17, 2024 | 3:25 PM
జార్జి రెడ్డిలోని బుల్లెట్ సాంగ్‌లో కనిపించిన ఈ నటి.. ఇప్పుడెలా ఉందంటే..?

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు హవా చూపిస్తున్నాయి. మంచి కథ కథనాలతో సక్సెస్ అందుకుంటున్నాయి. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ.. కేవలం స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అలాంటి చిత్రాల్లో ఒకటి జార్జి రెడ్డి. జార్జి రెడ్డి అనే స్టూడెంట్ లీడర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 2019లో విడుదలైంది. సిల్లి మాంక్స్ స్టూడియోస్, మిక్ మైక్స్, థ్రి లైన్ సినిమాస్ పతాకాలపై అప్పీ రెడ్డి తెరకెక్కించాడు. ఇందులో సందీప్ మాధవ్ లీడ్ రోల్ పోషించాడు. అంతకు ముందు కూడా ఆర్జీవీ తెరకెక్కించిన వంగవీటి మోహన్ రంగా బయోపిక్ వంగవీటిలో నటించగా.. మంచి మార్కులు పడ్డాయి. ఆ వెంటనే జార్జి రెడ్డి పాత్రకు షిఫ్ట్ అయ్యాడు. రియల్ జార్జి రెడ్డిలా, రెట్రో లుక్స్‌లో కనిపించేందుకు ఎంతో శ్రమ పడ్డాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా మెప్పించిన అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.

జార్జి రెడ్డి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’. ఈ బుల్లెట్ పాటతో మంగ్లీకి ఎంత పేరు వచ్చిందో.. ఆ పాటలో తన నటనతో, డ్యాన్సుతో ఆకట్టుకున్న హీరోయిన్ ముస్కాన్ ఖుబ్‌చందానీకి అంతే ఫేమ్ వచ్చింది. అప్పట్లో ఓ ఊపు ఊపేసిన సాంగ్ ఇది. ఇందులో ఆమె స్టెప్స్ కానీ, కళ్లతో పలకించిన హవా భావాలు కానీ అనిర్వచనీయం. రెట్రో లుక్‌లో బ్యూటీ కేక పుట్టించింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు రీల్స్, షాట్స్ చేసిన వాళ్లే. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఇప్పటి వరకు 147 మిలియన్ వ్యూస్‌తో ఇంకా దూసుకెళుతుండటం విశేషం. ఇక ఈ సినిమాతో ముస్కాన్ ఫేట్ మారిపోతుంది అనుకున్నారు. కానీ తెలుగులో జార్జి రెడ్డి తర్వాత కేవలం ఒక్క సినిమానే చేసింది. అదే రాజశేఖర్ నటించిన శేఖర్ మూవీ. ఇక అప్పటి నుండి కనిపించలేదు.. ప్రస్తుతం ఆమె ఏం చేస్తుందంటే..

George Reddy Movie Actress

ముస్కాన్ చిన్నప్పటి నుండే ఆల్ రౌండర్. జిమ్నాస్టిక్స్, కాలిస్టెనిక్స్‌లో శిక్షణ పొందిన కథక్ నర్తకి. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ముస్కాన్.. లాక్మే, లేయార్ వోట్టా గర్ల, కాఫీ బైట్ వంటి యాడ్స్ చేసింది. తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ వీర్ ది వెడ్డింగ్‌లో చిన్న పాత్రలో మెరిసింది. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి కంట్లో పడ్డ ఈ బ్యూటీ.. అలా తెలుగు తెరకు జార్జి రెడ్డితో పరిచయమైంది. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ లక్ష్మీ, 420 ఐపీసీ వంటి ఓటీటీ చిత్రాల్లో నటించింది.  జెన్ బుద్దీ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వీరికో పాప. ముస్కాన్ ఇప్పుడు చైల్ట్ ఎడ్యుకేటర్‌గా వ్యవహరిస్తోంది. ఇన్ స్టాలో పిల్లల సంరక్షణ గురించి ఎక్కువ వీడియోలు చేస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş