iDreamPost
android-app
ios-app

ఒక్క వీడియో.. జెనిలియా ఫ్యాన్స్ ని సంధిగ్ధంలో పడేసింది!

  • Author ajaykrishna Updated - 09:42 AM, Mon - 11 September 23
  • Author ajaykrishna Updated - 09:42 AM, Mon - 11 September 23
ఒక్క వీడియో.. జెనిలియా ఫ్యాన్స్ ని సంధిగ్ధంలో పడేసింది!

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ స్టార్డమ్ చూశారు.. చూస్తున్నారు.. వెళ్లిపోతున్నారు. అందులో స్టార్డమ్ ని చూసి పూర్తిగా ఎంజాయ్ చేసి వెళ్లేవారు కొందరైతే.. స్టార్డమ్ వస్తుంది అన్న టైమ్ లో వెళ్లిపోవడం అనేది షాక్ ఇచ్చే విషయం. అయినా.. హీరోయిన్స్ అంటే ప్రేక్షకులకు గుర్తు రావాల్సింది వాళ్లు చేసిన పాత్రలే గానీ.. వాళ్ళ గ్లామర్ కాదని కొందరు ప్రూవ్ చేసిన వారున్నారు. అలాంటి వారిలో జెనిలియా ఒకరు. తెలుగులో ఈ భామకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. గుర్తుంచుకోదగిన పాత్రలు చేసిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా జెనిలియా అనగానే అందరికీ బ్లాక్ బస్టర్ బొమ్మరిల్లు మూవీ గుర్తుకొస్తుంది. ఎందుకంటే.. ఆ సినిమాలో హాసినిగా జెనిలియా యాక్టింగ్ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ లో కనెక్ట్ అయ్యింది. అందుకే ఇప్పటికి బొమ్మరిల్లు సినిమా, హాసిని క్యారెక్టర్ మోస్ట్ ఫేవరేట్ గా ఉన్నాయి. తెలుగులో సత్యం మూవీతో డెబ్యూ చేసిన జెనిలియా.. ఆ తర్వాత సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, శశిరేఖ పరిణయం లాంటి సినిమాలలో మంచి రోల్స్ ప్లే చేసింది. కట్ చేస్తే.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అప్పటినుండి ఫ్యామిలీ, తన ఇద్దరు పిల్లలను చూసుకుంటోంది జెనిలియా.

ఇక ఇన్నాళ్లు బ్రేక్ తీసుకున్న జెనిలియా.. రీసెంట్ గా తన భర్త రితేష్ తోనే సూపర్ హిట్ మజిలీ సినిమాని ‘వేద్’గా రీమేక్ చేసి హిట్ అందుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న జెన్నీ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలను అందుకుంటోందట. ప్రస్తుతం జెన్నీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ బ్యూటీ మరోసారి తల్లి కాబోతుంది అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా తన భర్త రితేష్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొంది జెన్నీ. ఆ ఈవెంట్ లో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో మూడోసారి జెన్నీ ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో చూసి నిజంగానే సంధిగ్ధంలో పడిపోయారు ఫ్యాన్స్. మరి త్వరలోనే జెన్నీ గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss