iDreamPost
android-app
ios-app

Karthika Deepam-2: ‘కార్తీకదీపం 2’లో కొత్త మోనిత! గాయత్రి సింహాద్రి ఫుల్ బ్యాగ్రౌండ్!

  • Published Mar 25, 2024 | 5:07 PM Updated Updated Mar 25, 2024 | 5:07 PM

తెలుగు లోగిళ్ళలో కార్తీక దీపం సీరియల్ పుణ్యమా అని.. తెలుగు వారందరికీ పరిచయం అయ్యారు కార్తిక్, దీప , మోనిత . అయితే, ఇప్పుడు కార్తీక దీపం రెండవ సీజన్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రోమోలో మాత్రం మోనిత ప్లేస్ లో ఇంకెవరో కనిపిస్తున్నారు. ఆమె గురించి తెలుసుకుందాం.

తెలుగు లోగిళ్ళలో కార్తీక దీపం సీరియల్ పుణ్యమా అని.. తెలుగు వారందరికీ పరిచయం అయ్యారు కార్తిక్, దీప , మోనిత . అయితే, ఇప్పుడు కార్తీక దీపం రెండవ సీజన్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రోమోలో మాత్రం మోనిత ప్లేస్ లో ఇంకెవరో కనిపిస్తున్నారు. ఆమె గురించి తెలుసుకుందాం.

  • Published Mar 25, 2024 | 5:07 PMUpdated Mar 25, 2024 | 5:07 PM
Karthika Deepam-2: ‘కార్తీకదీపం 2’లో  కొత్త మోనిత! గాయత్రి సింహాద్రి ఫుల్ బ్యాగ్రౌండ్!

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం అంటూ.. కొన్నేళ్ల పాటు సాగినా “కార్తీక దీపం” సీరియల్.. జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్‌గా నిలిచింది. ఆ సీరియల్ లో నటించిన దీప, డాక్టర్ బాబు (కార్తీక్).. విలన్ పాత్రలో నటించిన మోనిత.. అందరు కూడా తెలుగు వారందరికీ బాగా సుపరిచితులు అయిపోయారు. ఈ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర విజయవంతంగా పూర్తి చేశారు. పార్ట్-1 కు వచ్చిన క్రేజ్ ను చూసి.. ఇప్పుడు కార్తీక దీపం-2 పేరుతో రెండవ సీజన్ ను స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు నుంచి స్టార్ మా లో రాత్రి 8గంటలకు.. కార్తీక దీపం-2 ప్రసారం కాబోతుంది. అయితే, ఈ ప్రోమోలో దీప, కార్తిక్ లు అయితే కనిపిస్తున్నారు . కానీ, మోనిత ప్లేస్ లో మాత్రం ఇంకెవరో కనిపిస్తున్నారు. దీనితో ఆ అమ్మాయి ఎవరా అనే ఆసక్తి అందరికి మొదలైంది. ఆమె ఎవరో తెలుసుకుందాం.

కార్తీక దీపం సీరియల్ లో ప్రధాన పాత్రలు పోషించిన దీప, కార్తిక్ లు ఎంత ఫేమస్ అయ్యారో.. విలన్ పాత్రలో నటించిన మోనిత కూడా అంతే ఫేమస్ అయింది. ఓ రకంగా ఆమెను మించిన లేడీ విలన్ మరొకరు ఉండరు అన్నంత బాగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈ క్యారెక్టర్ లేకపోతే సీరియల్ కు అర్ధమే ఉండదు. మోనిత.. సీరియల్ కు మెయిన్ పిల్లర్ లా నిలించింది. మరి అలాంటిది ఇప్పుడు రాబోయే పార్ట్-2 ప్రోమోలో మాత్రం మోనిత ఆచూకి ఎక్కడ కనిపించలేదు. ఆమె ప్లేస్ లో మరొకరు కనిపిస్తున్నారు. దీనితో మోనిత అభిమానులకు కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. ఆమె ఎవరు ! ఎలా చేస్తుంది .. మోనితల విలనిజం పండించగలదా లేదా అని. అయితే, ఆమె మరెవరో కాదు.. జీ తెలుగులో సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ‘త్రినయని’ సీరియల్‌లో కసి పాత్రలో.. విలనిజం పండించి.. నటనలో ఇన్వాల్వ్ అయిపోయే అమ్మాయి.. “గాయిత్రి సింహాద్రి”. అంతేకాకుండా జీ తెలుగులో సూపర్ ఫ్యామిలీ, ఈటీవీలో జోష్ వంటి ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలకు కూడా గాయిత్రి సింహాద్రి యాంకరింగ్ చేసింది.

కార్తిక దీపం సీరియల్ లో మోనిత పేరు ఏ రేంజ్ లో వినిపించిందో.. ఇక ఇప్పుడు కార్తీక దీపం పార్ట్-2 లో జోష్న అనే పేరు కూడా అదే రేంజ్ లో వినిపించడం ఖాయం. జోష్న పాత్ర చేస్తున్న ఈమెను గాయిత్రి మున్ని సింహాద్రి అని కూడా పిలుస్తుంటారు. ఈ సీరియల్ లో జోష్న క్యారక్టర్ లో డిఫరెంట్ నెగెటివ్ షేడ్స్ లో డిజైన్ చేసినట్లు సమాచారం. కార్తీక దీపం పార్ట్-2 సీరియల్ ను .. తమిళ్ లో సూపర్ హిట్ అయిన చెల్లమ్మ సీరియల్ కు రీమేక్ గా చేస్తున్నారు. చెల్లమ్మ సీరియల్ వెర్షన్ లో అయితే.. జోష్న కార్తిక్ ను ఇష్టపడుతుంది. కార్తీక్ మాత్రం జోష్నను ఇష్టపడడు. అంటే మళ్ళీ దీపకు కష్టాలు తప్పవు. ఈ పార్ట్ లో మోనిత(శోభా శెట్టి) లేని లోటును.. జోష్న(గాయత్రి సింహాద్రి) తీర్చబోతుందన్నమాట. ఇక ఎంత వరకు ఈ క్యారక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Telugutv_exclusive (@telugutv_exclusive)


Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibom