iDreamPost
android-app
ios-app

ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికైనా నేను రెడీ : ప్రముఖ నటి

  • Published Apr 24, 2024 | 1:08 PM Updated Updated Apr 24, 2024 | 1:08 PM

సినీ పరిశ్రమలో అడ్జస్ట్ మెంట్ అడుగుతున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తున్న వేళ.. ఆ హీరోతో అయితే బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా రెడీ అంటూ ఓ ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినీ పరిశ్రమలో అడ్జస్ట్ మెంట్ అడుగుతున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తున్న వేళ.. ఆ హీరోతో అయితే బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా రెడీ అంటూ ఓ ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Apr 24, 2024 | 1:08 PMUpdated Apr 24, 2024 | 1:08 PM
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికైనా నేను రెడీ : ప్రముఖ నటి

కాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సీనియర్ నటీమణుల దగ్గర నుండి అప్ కమింగ్ హీరోయిన్ల వరకు పరిశ్రమలో అడ్జస్ట్ మెంట్ లేనిదే అవకాశాలు రావని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కస్తూరి శంకర్ సైతం ఇదే తరహాలో కామెంట్స్ చేసింది. సింగర్ చిన్మయి శ్రీపాద సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతూనే ఉంది. తాము ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్న వాళ్లమేనని కొంత మంది నటీమణులు గళం విప్పారు కూడా. ఇప్పుడు మరో నటి తాను కూడా దీని బాధితురాలినే అని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఆ హీరోతో పడక పంచుకోవడానికి కూడా సిద్ధం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ నటీమణి.

టాలెంట్ చూసి అవకాశాలివ్వాలి కానీ.. అడ్జస్ట్ మెంట్ అడుగుతారని, ఆడిషన్లకు వెళ్లినప్పుడే దర్శకులు, నిర్మాతలు నేరుగా హీరోయిన్లనే చర్చిస్తున్నారని, వాళ్లకు ఓకే చెబితేనే ఆఫర్లు అంటూ వెల్లడించింది కోలీవుడ్ నటి గాయత్రి రేమా. టూరింగ్ టాకీస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో హీరోయిన్, సెకండ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. వెబ్ సిరీస్‌ల్లో అలరించింది. తెలుగులో కూడా ప్రణవం అనే ఒకే ఒక్క సినిమా చేసింది. గత ఏడాది ఐదు సినిమాలతో అలరించింది అమ్మడు. డ్యాన్స్ షోల్లో కూడా పాల్గొంటుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అడ్జస్ట్ మెంట్‌కు నో చెప్పడం వల్లే అవకాశాలు రావడం లేదని చెప్పుకొచ్చింది.

‘సల్మాన్ ఖాన్ ముద్దుసీన్లలో నటించడు. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా కూడా న్యూడ్ గా నటించడానికి అంగీకరించదు. అలాంటిది మేం మాత్రం మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి?’ అని ప్రశ్నించింది.అలాగే తనకు ఓ దర్శకుడు నుండి ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. నటించమని అడిగితే పర్వాలేదు కానీ.. పడుకోమని అడిగితే ఎలా అంటూ ప్రశ్నించింది. అడ్జస్ట్ మెంట్ అనేది తప్పు కాదు కానీ.. అది వాళ్ల వ్యక్తిగతం అని పేర్కొంది గాయత్రి రేమా. తనకు హీరో సిదార్థ్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో నటించే అవకాశం వస్తే.. బెడ్ పంచుకోవడానికి కూడా తాను రెడీ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

అలాగే షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న సమస్యను వెల్లడించింది. ‘ఓ ఎయిర్ పోర్టు దగ్గరల్లో షూటింగ్ జరుగుతోంది. నాకు సడన్‌గా పీరియడ్స్ వచ్చాయి. వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి ఇక్కడేదైనా బాత్రూమ్ ఉందా అని అడగాను. అతడు లేదని చెప్పాడు. ఇల్లు దగ్గరలో ఉంది.. ప్యాడ్ మార్చుకుని వస్తానని చెబితే.. ఎందుకు మేడమ్.. హీరోయిన్ కేరవాన్ ఉందని చెప్పాడు. అలాగే వెళ్లాను. కానీ హీరోయిన్ తల్లి.. ఆవేశంగా వచ్చి.. ఎందుకు లోపలికి వచ్చావన్నట్లు అనుమానంగా చూసింది. అప్పుడు ఎంతో బాధ వేసింది’ అని చెప్పింది. గాయత్రి..  మంగళాపురం, డోరా, సాయ, కాసు మేళ కాసు, మోహిని, వా వరలాం వా వంటి చిత్రాల్లో నటించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom