ఇండస్ట్రీలో విషాదం.. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు ఒకరు మృతి చెందారు. ఆ వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వివరాలు. .

ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు ఒకరు మృతి చెందారు. ఆ వార్త చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వివరాలు. .

ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపుగా ప్రతి రోజు ఏదో ఒక ఇండస్ట్రీలో విషాదకర వార్త వెలుగు చూస్తూనే ఉంది. ఇక మంగళ వారం నాడు ఇద్దరు ఇండస్ట్రీ ప్రముఖులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మలయాళ దర్శకుడు, యువ నటి ఇద్దరు మృత్యువాత పడ్డారు. కొందరు అనారోగ్యం కారణంగా చనిపోతూంటే.. మరి కొందరేమో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక నేడు అనగా బుధవారం నాడు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు ఒకరు మృతి చెందారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా నటుడు అంటే..

చిత్ర పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. మంగళవారం నాడు ఇద్దరు సినీ ప్రముఖులు చనిపోగా.. నేడు ఓ హాలీవుడ్‌ యాక్టర్‌ కన్ను మూశాడు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు ఇయాన్ గెల్డర్ మృతి చెందాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ చిత్రంలో కెవాన్ లన్నిస్టర్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు చేరువై.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే కొంత కాలం క్రితం ఈ నటుడు క్యాన్సర్‌ బారిన పడ్డాడని తెలుస్తోంది. చికిత్స తీసుకుంటున్నప్పటికి.. ఫలితం లేకపోయింది. చివరకు బుధవారం నాడు కన్నుమూశాడు. ఈ విషయాన్ని బెన్ డేనియల్స్ ధృవీకరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. ఆయన అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు

ఇక ఇయాన్ గెల్డర్‌ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌తో పాటు సర్జ్‌, క్వీర్స్‌, షేక్స్‌పియర్ గ్లోబ్, హిజ్ డార్క్ మెటీరియల్స్. అండర్‌డాగ్‌ లాంటి చిత్రాల్లో నటించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో కెవాన్ లన్నిస్టర్ పాత్రకే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. కాగా.. ఇటీవలే టైటానిక్ నటుడు సైతం మరణించిన సంగతి తెలిసిందే.

గేమ్ ఆఫ్ త్రోన్స్ అన్నది డేవిడ్ బెనియాఫ్, డి.బి.వైస్ సృష్టించిన అమెరికన్ ఫాంటసీ డ్రామా టీవీ సీరీస్. దీనికి ప్రపంచవ్యాస్తంగా అభిమానులున్నారు. ఎమ్మీ సహా అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈ సీరిస్‌. ఎనిమిది సీజన్‌లు ప్రసారం అయ్యింది. ఇక ఈ సూపర్‌ సిరీస్‌కు మన దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఫిదా అయ్యాడు. ఫాంటసీ, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్స్, రొమాన్స్‌ గ్రాఫిక్స్‌, మోసం, డైలాగ్స్ వంటి అన్ని అంశాలు కలగలిపిన ఈ యాక్షన్‌ అడ్వెంచెరస్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జియో సినిమాలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Show comments