iDreamPost
android-app
ios-app

నవంబర్ లో అల్లు అర్జున్ , రామ్ చరణ్ పోటా పోటీ..

  • Published Oct 28, 2024 | 4:56 PM Updated Updated Oct 28, 2024 | 4:56 PM

తెలుగు వారు సినిమాలను ఏ రకంగా ప్రేమిస్తారో తెలియనిది కాదు. ఇప్పటివరకు అది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. ఏదైన స్టార్ హీరో సినిమా వస్తుందంటే.. దానికి ఓ నెల ముందు నుంచే హడావిడి ఉంటుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న హడావిడి కూడా అదే. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

తెలుగు వారు సినిమాలను ఏ రకంగా ప్రేమిస్తారో తెలియనిది కాదు. ఇప్పటివరకు అది చాలా సార్లు ప్రూవ్ అయింది కూడా. ఏదైన స్టార్ హీరో సినిమా వస్తుందంటే.. దానికి ఓ నెల ముందు నుంచే హడావిడి ఉంటుంది. ఇక ఇప్పుడు జరుగుతున్న హడావిడి కూడా అదే. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 28, 2024 | 4:56 PMUpdated Oct 28, 2024 | 4:56 PM
నవంబర్ లో అల్లు అర్జున్ , రామ్ చరణ్ పోటా పోటీ..

‘జరగండి జరగండి’ అంటూ గేమ్ ఛేంజర్ నుంచి రామ్ చరణ్, ‘పుష్ప రాజ్.. తగ్గేదేలే’ అంటూ పుష్ప 2 నుంచి అల్లు అర్జున్.. వారి సినిమాలతో యుద్ధంలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ కు ఓ నెల రోజుల గ్యాప్ ఉంది. కానీ నవంబర్ నుంచి ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ జరగబోతున్నాయి. ఓ నెల రోజుల పాటు అటు రామ్ చరణ్ , ఇటు అల్లు అర్జున్ తమ సినిమా ప్రమోషన్స్ తో దుమ్ము దులుపబోతున్నారు. వీరి సినిమాల ప్రమోషన్స్ ముందు ఇంకా ఏ సినిమాలు వచ్చినా కానీ తేలిపోతాయని చెప్పడంలో.. ఎలాంటి సందేహం లేదు. గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే మూడేళ్ళ నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అటు మూవీ టీం కూడా రిలీజ్ డేట్స్ ను మార్చి మార్చి ఆఖరికి సంక్రాంతి రిలీజ్ కు ఫిక్స్ చేశారు.

ఈసారైన చెప్పిన టైం కు రిలీజ్ చేస్తే చాలని అనుకుంటున్నారు అభిమానులు. అటు మేకర్స్ కూడా ఈ మధ్యనే వరుస అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా 75 రోజుల సమయం ఉన్నట్లు తాజాగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దీనితో చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఇక నవంబర్ లో మిగిలిన మూడు సాంగ్స్ , ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత డిసెంబర్ లో కంప్లీట్ గ్రౌండ్ ఈవెంట్స్ ను ప్లాన్ చేసేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇక పుష్ప సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ కంటే ముందే పుష్ప2 సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి నవంబర్ నెల పుష్ప 2 కు చాలా కీలకం అని చెప్పి తీరాలి. నవంబర్ లో ఈ సినిమా నుంచి ట్రైలర్ , రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఇక ఆ తర్వాత  డిసెంబర్ 5న పుష్ప రాజ్ ఎలాగూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి వచ్చేస్తాడు. ప్రస్తుతం సినిమాలో ఐటెం సాంగ్ షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందా అని అటు అభిమానులతో పాటు.. ఇటు ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తుంది. పైగా పుష్ప ముందు ఉన్నవి కూడా భారీ టార్గెట్స్ ఏ. ఏకంగా బాహుబలి 2 రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా ఈ సినిమా రిజల్ట్ ఉండబోతుందంటూ టాక్ నడుస్తుంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం.. పుష్ప 2 వచ్చే సినిమాలకు బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసినట్లే. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో.. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని అంతే కంగారులో ఉన్నారు. ఇలా మొత్తానికి నవంబర్ నెలను ప్రమోషన్స్ , అప్డేట్స్ తో నింపేయడానికి బన్నీ , చరణ్ రెడీ అవుతున్నారు. మరి ఇవి సినిమాలపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom