iDreamPost
android-app
ios-app

పుష్ప రాజ్ చెప్పింది.. గేమ్ ఛేంజర్ చేసి చూపిస్తుంది.. మ్యాటర్ ఏంటంటే ?

  • Published Nov 23, 2024 | 4:38 PM Updated Updated Nov 23, 2024 | 4:38 PM

Game Changer Movie Updates : మొన్న పుష్ప సినిమా ట్రైలర్ లో బన్నీ చెప్పినట్లు .. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే ఈ డైలాగ్ కేవలం ఒక్క పుష్ప సినిమాకే కాదు.. నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కూడా వర్తిస్తుందేమో. ఇప్పుడు పుష్పరాజ్ చెప్పింది.. గేమ్ ఛేంజర్ చేసి చూపిస్తుంది.

Game Changer Movie Updates : మొన్న పుష్ప సినిమా ట్రైలర్ లో బన్నీ చెప్పినట్లు .. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే ఈ డైలాగ్ కేవలం ఒక్క పుష్ప సినిమాకే కాదు.. నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కూడా వర్తిస్తుందేమో. ఇప్పుడు పుష్పరాజ్ చెప్పింది.. గేమ్ ఛేంజర్ చేసి చూపిస్తుంది.

  • Published Nov 23, 2024 | 4:38 PMUpdated Nov 23, 2024 | 4:38 PM
పుష్ప రాజ్ చెప్పింది.. గేమ్ ఛేంజర్ చేసి చూపిస్తుంది.. మ్యాటర్ ఏంటంటే ?

ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయి ఎక్కడ ఉండేదో.. ఇప్పుడు ఎక్కడ ఉందో ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్ధమౌతుంది. మన హీరోలు , దర్శకులు తెలుగు సినిమా రేంజ్ ను పెంచే పనిలో ఉన్నారు. భాషలు దాటి హద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుంది. ఎన్నో అవార్డులు రివార్డ్ లు తెచ్చిపెడుతుంది. మొన్న పుష్ప సినిమా ట్రైలర్ లో బన్నీ చెప్పినట్లు .. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే ఈ డైలాగ్ కేవలం ఒక్క పుష్ప సినిమాకే కాదు.. నెక్స్ట్ రాబోతున్న సినిమాలకు కూడా వర్తిస్తుందేమో. ఇప్పుడు పుష్పరాజ్ చెప్పింది.. గేమ్ ఛేంజర్ చేసి చూపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే గేమ్ ఛేంజర్ మూవీ టీం ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ వర్క్ లో బిజీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ ఈవెంట్ కండక్ట్ చేసి టీజర్ ను లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలో నిర్వహించబోతున్నారట.

ఎక్కడైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో లేదా పక్క రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. కానీ గేమ్ ఛేంజర్ మాత్రం ఏకంగా పక్క దేశంలో ఈవెంట్ ను ప్లాన్ చేసింది. USA లోని ర్టిస్‌ కల్‌వెల్‌ సెంటర్‌, 4999 నామన్‌ ఫారెస్ట్‌, టెక్సాస్‌ లో.. డిసెంబరు 21 గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. మహా అయితే ఇప్పటివరకు హీరోస్ అంతా వాళ్ళ వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ తొలిసారి ఓ సినిమా ఏకంగా విదేశాల్లో ఈవెంట్ ను నిర్వహించబోతుంది. దీనితో ఫారెన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్న మొదటి ఇండియన్ మూవీగా.. గేమ్ ఛేంజర్ రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కు చరణ్ న్యాయం చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా నిన్న మొన్నటివరకు కాస్త నిరాశగా ఉన్న ఫ్యాన్స్ కు.. ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ సినిమాపై హోప్స్ పెంచుతున్నాయి. ఇండియన్ 2 ప్లాప్ అయింది కదా గేమ్ చెంజర్ ఏం చేస్తాడో.. అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. కానీ టీజర్ కట్ రిలీజ్ చేసి అందరి డౌట్స్ కు చెక్ పెట్టాడు శంకర్. ఇక ఇప్పుడిప్పడు వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే. శంకర్ ఎదో భారీగానే ప్లాన్ చేసాడనిపిస్తుంది. కాస్త లేట్ అయితే అయింది కానీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే అదే చాలని అభిమానులు భావిస్తున్నారు. పైగా చరణ్ రాజకీయ నాయకుడిగా , ఐఏఎస్ అధికారిగా నటించబోతున్నాడు. ముఖ్యంగా అందరి ఫోకస్ ఈ రెండు క్యారెక్టర్స్ మీదే ఉంది. శంకర్ చరణ్ ను ఎలా చూపించబోతున్నాడా అని అంతా క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఏమౌతుందో, జనవరి 10న ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet