iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగల్ పై భారీ డిస్కషన్.. దేవర థియేటర్ లో!

  • Published Sep 24, 2024 | 4:40 PM Updated Updated Sep 24, 2024 | 4:40 PM

Game Changer Second Single Devara theaters: రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రానున్న గేమ్ ఛేంజర్ సినిమాపై.. ఇప్పటివరకు అయితే మరి అంత ఎక్కువ బజ్ ఏమి లేదు. కానీ, ఎప్పుడైతే మూవీ నుంచి సెకండ్ సింగల్ ను రిలీజ్ చేస్తాం అన్నారో అప్పుడే భారీ డిస్కషన్ మొదలైంది.

Game Changer Second Single Devara theaters: రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రానున్న గేమ్ ఛేంజర్ సినిమాపై.. ఇప్పటివరకు అయితే మరి అంత ఎక్కువ బజ్ ఏమి లేదు. కానీ, ఎప్పుడైతే మూవీ నుంచి సెకండ్ సింగల్ ను రిలీజ్ చేస్తాం అన్నారో అప్పుడే భారీ డిస్కషన్ మొదలైంది.

  • Published Sep 24, 2024 | 4:40 PMUpdated Sep 24, 2024 | 4:40 PM
గేమ్ ఛేంజర్ సెకండ్ సింగల్ పై భారీ డిస్కషన్.. దేవర థియేటర్ లో!

ప్రస్తుతం తారక్ అభిమానులతో పాటు.. మూవీ లవర్స్ అంతా కూడా దేవర కోసమే ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా అంతా దేవర హైప్ ఏ కొనసాగుతుంది. అయితే దేవర మూవీ రిలీజ్ రోజునే మెగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కు దేవర మూవీ ఎంత ముఖ్యమో.. చరణ్ కు కూడా గేమ్ ఛేంజర్ మూవీ అంతే ముఖ్యం. కానీ ఈ సినిమాపై మాత్రం అంతగా టాక్ వినిపించడం లేదు. పైగా ఇప్పటివరకు ఒక సాంగ్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. కానీ రీసెంట్ గా త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తాం అని చెప్పగానే.. దీని గురించి భారీ డిస్కషన్స్ మొదలయ్యాయి. పైగా సెకండ్ సింగిల్ రిలీజ్ కోసం ఓ స్పెషల్ డేట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.

గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ తో ఇప్పటివరకు రాని మూమెంట్.. సెకండ్ సింగల్ తో రప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా డైరెక్ట్ చేసిన పేరున్న ప్రముఖ దర్శకుడు శంకర్ అయినా కూడా.. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ కు రావాల్సిన హైప్ రాలేదు.పైగా కొత్త భయాలు మొదలయ్యాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. మొదటి సింగల్ తో ఎక్కడా కూడా శంకర్ రేంజ్ స్టాండర్డ్స్ ను ఈ మూవీ మెయింటెయిన్ చేయలేకపోయింది. దీనితో ఈ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు మేకర్స్ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసమే దేవర మూవీ రిలీజ్ రోజున.. థియేటర్స్ లో సెకండ్ సింగల్ ను ప్రదర్శించేందుకు చూస్తున్నారు. జరగండి జరగండి పాటలా ఇది కూడా అంతంత మాత్రంగా అనిపిస్తుందా.. లేదా మూవీ స్టాండర్డ్స్ ను పెంచుతుందా అనేది చూడాలి. కనీసం రెహమాన్ స్టైల్ లో అయినా సెకండ్ సింగిల్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

మరి ప్రేక్షకులకు అంచనాలను తమన్ అందుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఈసారి వచ్చే అప్డేట్ తో అయినా మూవీపై హైప్ క్రియేట్ అయితే కనుక.. సినిమాపై నమ్మకాలు పెంచుకోవచ్చు. ఇక ఈ సినిమాలో కొంత పార్ట్ ను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడట. లాంగ్ షాట్స్ ను కొన్ని సీన్స్ ను ఇప్పటికే ఈ దర్శకుడు షూట్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఎలాగూ శంకర్ పేరు పెద్దగా వినిపించడం లేదు కాబట్టి.. శంకర్ వదిలేసిన దగ్గర నుంచి మొత్తం శైలేష్ కొలను నే దర్శకత్వం వహించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ మెగా హీరో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఏదేమైనా సరిగ్గా దేవర మూవీ రోజునే సెకండ్ సింగల్ ను రిలీజ్ చేయడంతో.. మెగా అభిమానులు ఖుషి అయిపోతున్నారు. మరి ఈ సెకండ్ సింగల్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026