iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ అదిరే అప్డేట్స్.. ప్రమోషనల్ ప్లాన్స్ రెడీ..!

  • Published Nov 05, 2024 | 2:46 PM Updated Updated Nov 05, 2024 | 2:46 PM

Game Changer Updates : రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా మీద అభిమానులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Game Changer Updates : రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా మీద అభిమానులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాకు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉండడంతో పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 05, 2024 | 2:46 PMUpdated Nov 05, 2024 | 2:46 PM
గేమ్ ఛేంజర్ అదిరే అప్డేట్స్.. ప్రమోషనల్ ప్లాన్స్ రెడీ..!

ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన్న మిత్ బ్రేక్ చేయడంలో చరణ్.. ఇండియన్ 2 తర్వాత ఎలా అయినా తన మార్క్ ప్రూవ్ చేసుకోవడంలో శంకర్.. ఇద్దరు బిజీ బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ ఇప్పుడు వీరి ఇద్దరి ముందున్న అతి పెద్ద ఛాలెంజ్. పైగా ఇది సంక్రాంతి రేస్ లో పాల్గొంటుంది. ఈసారి పోటీ సీనియర్ హీరోలతోనే. కాబట్టి ఎలా అయినా సరే ఈ సినిమా ఆ రేస్ లో విన్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవాల్సిందే. సో దానికోసం ఇప్పటినుంచే చాలా పకడ్బందీగా అన్నిటిని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒక్క దెబ్బతో సినిమా మీద ఇప్పటివరకు వచ్చిన నెగెటివిటీ అంత తుడిచిపెట్టుకుపోయే.. మాస్టర్ ప్లాన్ రెడీ గా ఉంది. ఇక పాత రికార్డ్స్ బ్రేక్ చేసి.. కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడమే లేట్. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాలేదులే కానీ.. ఒక్కసారి సరైన అప్డేట్ పడితే ఇక అప్పుడు సినిమా మీద అసలైన హైప్ మొదలవుతుంది.

ఈ క్రమంలో ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ టీజర్ లాంచ్ తో స్టార్ట్ అవుతున్నాయి. నవంబర్ 9 న ఈ ఈవెంట్ ను లక్నోలో భారీగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ కు గేమ్ ఛేంజర్ టీం మొత్తం అటెండ్ అవుతుందట. సినిమా నుంచి రానున్న మొట్ట మొదటి నేషనల్ ఈవెంట్ కావడంతో.. దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద జరిగిన విపరీతమైన నెగెటివిటి కారణంగా.. అంచనాలు కాస్త బ్యాలన్స్ తప్పుతున్నాయి. దీనితో అందరి కళ్ళు టీజర్ ఎలా ఉండబోతుందనే దాని మీదే ఉన్నాయి. ఇక ఈ ఈవెంట్ తర్వాత.. జనవరి 1 న ముంబై లో కానీ చెన్నైలో కానీ మరో గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించి.. ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈలోపు ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఒక్కో ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మూవీ టీం తో పాటు రామ్ చరణ్ కూడా దాదాపు అన్ని ఈవెంట్స్ కు అటెండ్ కానున్నాడట. ఇక లాస్ట్ ఈవెంట్ ను మాత్రం తిరుపతిలో చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు ఇంకో రెండు నెలలు సమయం ఉంది. కాబట్టి దానికి తగినట్లు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని.. సరిగ్గా ప్రమోట్ చేస్తే ఇక గేమ్ చెంజర్ కు తిరుగుండదు. ఇదిలా ఉంటె మరో వైపు అభిమానులు ప్రమోషనల్ స్పీడ్ ను మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

కౌంట్డౌన్ పోస్టర్స్ రిలీజ్ చేయాలనీ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన రెండు సాంగ్స్ లో రా మచ్చ సాంగ్ కు మంచి రీచ్ వచ్చింది. ఆ తర్వాత జరగండి జరగండి సాంగ్ కు డ్యాన్స్ పరంగా హైప్ ఉంది. ఇక మిగిలిన మూడు సాంగ్స్ టీజర్ తర్వాత రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మొత్తానికి మేకర్స్ అయితే సినిమాకు ఎలా అయినా హైప్ పెంచాలని.. పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు. మరి బయటకు వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ ను ఎలా అయినా హిట్ చేయాలనీ చూస్తున్నారు. ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomMarsbahis girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/