iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి టాలీవుడ్ కొత్త హీరోయిన్.. స్టార్ అవ్వడం పక్కా..!

  • Published Aug 17, 2024 | 6:52 PM Updated Updated Aug 17, 2024 | 6:52 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇండస్ట్రీకి దొరికేసిన కొత్తమ్మాయి. ఈ మూడు నెలల కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇండస్ట్రీకి దొరికేసిన కొత్తమ్మాయి. ఈ మూడు నెలల కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Aug 17, 2024 | 6:52 PMUpdated Aug 17, 2024 | 6:52 PM
ఈ చిన్నారి టాలీవుడ్ కొత్త హీరోయిన్.. స్టార్ అవ్వడం పక్కా..!

తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త ముద్దుగుమ్మలు వస్తున్నారు. ప్రతి నెల కొత్త ఫేస్ ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈ ఏడాది కూడా ఎంతో మంది అమ్మాయిలు టాలీవుడ్‌లో అడుగుపెట్టి కనువిందు చేస్తున్నారు. అయితే కొంత మంది స్టార్ హీరోల చిత్రాలతో ఎంట్రీ ఇస్తుంటే.. మరికొంత మంది టైర్ 2, 3 హీరోల చిత్రాల్లో తెరంగేట్రం ఇస్తున్నారు. ఇదిగో ఈ ఫోటోలోని చిన్నది కూడా.. నటిగా మారింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ సక్సెస్ కాకపోవడంతో అంత రిజిస్టర్ కాలేదు. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. నయన్ సారిక.

జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ హీరోగా వచ్చిన మూవీ ఆయ్. గోదావరి బ్యాక్ డ్రాప్ట్ తో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో రూపొందించిన ఈ మూవీకి అంజి మణిపుత్ర దర్శకుడు. ఈ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఆగస్టు 15న తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. తొలి షో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా నటించింది నయన్ సారిక. తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో కట్టిపడేసింది. పల్లవి పాత్రలో తండ్రి చాటు బిడ్డగా నటించి మెప్పించింది. కాగా, ఇది ఆమెకు రెండో సినిమా. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

కాగా, ఆమె గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా అనే చిత్రంలో నటించింది. మే 31న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆనంద్‌ను ప్రేమించి మోసం చేసే శ్రుతి పాత్రలో కనిపించింది. అయితే ఇందులో పెద్దగా రిజిస్టర్ లేని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత ఆయ్‌లో మెయిన్ క్యారెక్టర్‌లో మెరిసింది. ఇందులో కూడా కుల పిచ్చి ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే అందులో ‘ఆయ్.. మీరు ఏమిట్లు’ అంటూ హీరోను ప్రశ్నించి.. శ్రీలీలతో కూడా వావ్ అనిపించుకుంది నయన్. ఈ మూడు నెలల కాలంలో రెండు సినిమాలతో పలకరించింది ఈ న్యూ హీరోయిన్. ఆయ్ మూవీ హిట్ టాక్‌తో టాలీవుడ్‌కు మరో క్రేజీ హీరోయిన్ దొరికేసింది. ఈ మూవీ తర్వాత బిజీయెస్ట్ హీరోయిన్ కావాలని మనమూ కోరుకుందాం.. ఆయ్.. ఏమంటారు..?

 

View this post on Instagram

 

A post shared by GA2 Pictures (@ga2pictures)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom