iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఇప్పుడు తోపు హీరోయిన్! మీరు గుర్తు కూడా పట్టలేరు!

  • Published Jun 10, 2024 | 4:13 PM Updated Updated Jun 10, 2024 | 4:13 PM

చీపురుపట్టుకుని ఇల్లంతా చిమ్మేసేందుకు రెడీగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. అటు తమిళ్, ఇటు తెలుగులోనూ యాక్ట్ చేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

చీపురుపట్టుకుని ఇల్లంతా చిమ్మేసేందుకు రెడీగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. అటు తమిళ్, ఇటు తెలుగులోనూ యాక్ట్ చేస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Jun 10, 2024 | 4:13 PMUpdated Jun 10, 2024 | 4:13 PM
ఈ చిన్నారి.. ఇప్పుడు తోపు హీరోయిన్! మీరు గుర్తు కూడా పట్టలేరు!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది ఫేమస్ అవుతున్నారు. తమ వీడియోలతో నెట్టింట్లో హల్చల్ చేస్తుంటారు. అలాగే నేమ్, ఫేమ్ తెచ్చుకుంటారు. వీరి ఫాలోయింగ్ చూసి సినిమా వాళ్లు.. వారిపై ఓ లుక్కేస్తుంటారు. ఆటోమేటిక్‌గా బుల్లితెరపైనే లేదా వెండితెరకో పరిచయం అవుతుంటారు. ఇలా యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ మాత్రమే కాకుండా బ్యాన్ చేసిన టిక్ టాక్, డబ్ స్మాష్ ద్వారా కూడా ఫేమ్ పొంది సెలబ్రిటీ హోదా తెచ్చుకున్నవారున్నారు. తర్వాత వరుస ఛాన్సులు కొడుతూ బిజీయెస్ట్ నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇదిగో ఈ ఫోటోలో చీపురు పట్టుకుని కనిపిస్తున్న ఈ పాప సైతం సోషల్ మీడియాను పునాదిగా చేసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగింది.

అత్యంత సాదా సీదా కుటుంబలో పుట్టిన ఈ పాప. బీటెక్ చదవి.. ఐబీఎం వంటి సంస్థల్లో జాబ్ చేసింది. అయితే ఖాళీ సమయాల్లో టిక్ టాబ్, డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. ఆమె వీడియోలను చూసిన దర్శకుడు సినిమా ఆఫర్ చేశాడు. ఫస్ట్ సినిమానే స్టార్ హీరో,హీరోయిన్లు నటించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమెకు అవకాశాన్ని ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీనే. ఇక్కడ ఒక్క సినిమా చేసి..తమిళనాడుకు వెళ్లిపోయి స్టార్ హీరోయిన్‌గా మారుతోంది ఈమె. ఇంతకు ఆ పాప ఎవరు అంటే.. మృణాళిని రవి. 1995లో జన్మించిన మృణాళిని.. 2019లో సూపర్ డీలక్స్ అనే చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఇందులో ఏలియన్ అమ్మాయి పాత్రలో కనిపించేది ఈ బ్యూటీనే. త్యాగరాజన్ కుమారరాజా దీనికి దర్శకుడు. ఫహద్ ఫజిల్, విజయ్ సేతుపతి మరియు సమంత నటించారు.

ఈ మూవీ చిన్న రోల్ అయినా.. తెలుగులో గద్దల కొండ గణేష్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో మెయిన్ రోల్ చేసింది. ఈ సినిమా ఓకే అనిపించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, అథర్వతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. చాంపియన్, ఎనిమీ,ఎంజీఆర్ మగన్, జంగో, కోబ్రా వంటి సినిమాల్లో నటించింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పలకరించింది బ్యూటీ ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మాయా మశ్చీంద్ర వంటి చిత్రాలు చేసింది. ఈ ఏడాది ఓ మూవీతో పలకరించింది ఈ సోయగం. విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన రోమియో చిత్రంలో నటించింది. ఇందులో భర్త అంటే ఇష్టం లేని భార్యగా.. కొత్త లుక్స్‌లో కట్టిపడేసింది ఈ యంగ్ హీరోయిన్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet