iDreamPost
android-app
ios-app

Bhagyashri: ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా భాగ్యశ్రీ బోర్సే! స్టేజ్ ఎక్కితే షేక్ చేస్తోంది!

  • Published Aug 13, 2024 | 12:36 PM Updated Updated Aug 13, 2024 | 12:36 PM

Mr Bachchan-Bhagyashri Borse Dance: టాలీవుడ్ లో సెన్సేషన్ గా నిలిచింది భాగ్యశ్రీ బోర్సే. తాజాగా చేసిన డ్యాన్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ వివరాలు..

Mr Bachchan-Bhagyashri Borse Dance: టాలీవుడ్ లో సెన్సేషన్ గా నిలిచింది భాగ్యశ్రీ బోర్సే. తాజాగా చేసిన డ్యాన్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ వివరాలు..

  • Published Aug 13, 2024 | 12:36 PMUpdated Aug 13, 2024 | 12:36 PM
Bhagyashri: ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా భాగ్యశ్రీ బోర్సే! స్టేజ్ ఎక్కితే షేక్ చేస్తోంది!

సినిమాల్లో రాణించాలని చాలా మంది కలలు కంటారు. అయితే అందరికి అలాంటి అవకాశం లభించదు. ఇక లక్కు బాగుండి.. సినిమా అవకాశం వచ్చిన వారు.. తమను తాను నిరూపించుకోవడం కోసం ఎంత కష్టపడటానికి అయినా వెనకాడరు. మరీ ముఖ్యంగా డ్యాన్స్, యాక్టింగ్ విషయంలో తమ టాలెంట్ ను ప్రదర్శిస్తారు. ఇక యువతులు ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే.. అందం, టాలెంట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ రెండు మెండుగా ఉంటేనే అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం హీరోయిన్ భాగ్య శ్రీ విషయంలో ఇదే కనిపిస్తోంది. తనలోని డ్యాన్స్ టాలెంట్ తో ఓ ఊపు ఊపుతోంది భాగ్య శ్రీ. ఆమె కాలు కదిపితే.. స్టేజ్ షేక్ అవుతోంది. ఆ వివరాలు..

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. పనోరమా స్టూడియోస్‌, టీ సిరీస్‌ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. మరో రెండు రోజుల్లో అనగా ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. మూవీ రిలీజ్ నేపథ్యంలో.. మిస్టర్ బచ్చన్ టీమ్.. కర్నూలులో సోమవారం రాత్రి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

bhagya sri borse

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్‌ భానుతో కలిసి భాగ్యశ్రీ బోర్సే డాన్స్ చేశారు. మిస్టర్‌ బచ్చన్‌ సినిమాలోని ‘రెప్పల్‌.. డప్పుల్‌’ సాంగ్‌కు అదిరే స్టెప్స్ వేశారు. స్టేజ్ మీద భాగ్యశ్రీ తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే.. కుర్రకారు పునకాలు వచ్చినట్లే ఊగిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. మంగ్లీ, అనురాగ్‌ కుల్‌కర్ణి ఆలపించారు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘నల్లంచు తెల్లచీర’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కూడా భాగ్యశ్రీ బోర్సే డాన్స్ ఇరగదీశారు. తనలోని ఈ అద్భుత టాలెంట్ తో భాగ్యశ్రీ పేరు సినిమా రిలీజ్ కు ముందే మార్మోగిపోతుంది. ఇక మూవీలో ఆమె యాక్టింగ్ కూడా బాగుంటే.. టాప్ హీరోయిన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు. ఇప్పటికే భాగ్యశ్రీ తన అందం, డ్యాన్స్ తో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆమె డ్యాన్స్ చూసిన వారు.. భాగ్యశ్రీ అంటే అందం మాత్రమే కాదు.. ఓ అణుబాంబు అంటున్నారు. ఆమెను పరిచయం చేసిన హరీశ్ శంకర్ ను అభినందిస్తున్నారు. భయ్యా ఎక్కడ నుంచి తీసుకొచ్చావ్ ఇంతందాన్ని అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఉత్తరాది బ్యూటీ అయిన భాగ్యశ్రీ ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో నటించారు. అంతకుముందు యారియాన్ 2లో నటించారు. ఇక తెలుగులో మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా రిజల్ట్ తో అమ్మడి భవిష్యత్తు ఎలా ఉండనుందో తెలియనుంది. అభిమానులు మాత్రం భాగ్య శ్రీ ఇండస్ట్రీని ఏలడం పక్కా అంటున్నారు.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişGrandbetting girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel