iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా ఇండియన్ క్రికెటర్! ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!

  • Author ajaykrishna Published - 01:21 PM, Mon - 17 July 23
  • Author ajaykrishna Published - 01:21 PM, Mon - 17 July 23
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా ఇండియన్ క్రికెటర్! ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ కి తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే సీజన్ 7తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 నుండి వచ్చిన ప్రోమో.. ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసింది. మున్ముందు షోకి సంబంధించి మెయిన్ ప్రోమో రాబోతుంది. అయితే.. లాస్ట్ సీజన్ ప్రేక్షకాదరణ పరంగా భారీగా విఫలం అయ్యింది. దీంతో ఈసారి నిర్వాహకులు చాలా పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోనూ 7వ సీజన్ లో కంటెస్టెంట్స్ విషయంలోను ఎక్కడా రాజీపడట్లేదని.. షో లెవెల్ ని పెంచే విధంగా కంటెస్టెంట్స్ ని ఎంపిక చేస్తున్నట్లు టాక్.

ఇక బిగ్ బాస్ 7వ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. కొంతమంది ఆల్రెడీ ఖరారు అయ్యారని.. కొన్ని పేర్లు వైరల్ గా మారాయి. వారిలో మాజీ ఇండియన్ క్రికెటర్ వేణుగోపాల్ రావు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ టీమ్ తరపున.. అలాగే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎన్నో మ్యాచులు ఆడిన వేణుగోపాల్.. కొన్నాళ్ళుగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నారు. కానీ.. ఐపీఎల్ టోర్నమెంట్ లో తెలుగు కామెంట్రీ హోస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం రూమర్ మాత్రమే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.

ఇన్నాళ్లు వేణుగోపాల్ ఒక క్రికెటర్ గానే అందరికి తెలుసు. కానీ.. ఈసారి బిగ్ బాస్ లో ఆటగాడిగా చూస్తారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ఏడో సీజన్ కోసం సోషల్ మీడియా వాళ్లను కాకుండా.. పేరున్న సెలబ్రిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట నిర్వాహకులు. అదిగాక ఈసారి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంట కూడా రానుందని టాక్. ముందు సీజన్లతో పోల్చుకుంటే.. ఈసారి గేమ్ ని చాలా వెరైటీగా డిజైన్ చేశారని తెలుస్తోంది. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ సెట్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి బిగ్ బాస్ 6 లాగా కాకుండా ఈ 7వ సీజన్ మళ్లీ షోకి పూర్వవైభవం తెస్తుందేమో చూడాలి. మరి బిగ్ బాస్ 7 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş