iDreamPost
android-app
ios-app

విల్‌ స్మిత్‌పై మాజీ అసిస్టెంట్‌ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ హాలీవుడ్‌ హీరో విల్‌ స్మిత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్మిత్‌ మాజీ అసిస్టెంట్‌ ఆయనపై సంచలన కామెంట్లు చేశారు. ఓ ప్రముఖ నటుడితో స్మిత్‌కు సంబంధం ఉందని అన్నారు...

ప్రముఖ హాలీవుడ్‌ హీరో విల్‌ స్మిత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్మిత్‌ మాజీ అసిస్టెంట్‌ ఆయనపై సంచలన కామెంట్లు చేశారు. ఓ ప్రముఖ నటుడితో స్మిత్‌కు సంబంధం ఉందని అన్నారు...

విల్‌ స్మిత్‌పై మాజీ అసిస్టెంట్‌ సంచలన వ్యాఖ్యలు!

హాలీవుడ్‌ సినిమాలు చూసే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు విల్‌ స్మిత్‌. హీరోగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగు నాట కూడా విల్‌ స్మిత్‌ను ఇష్టపడేవారు ఉన్నారు. ఆయన నటించిన హాలీవుడ్‌ సినిమాలు ఇక్కడ కూడా డబ్‌ అయి రిలీజ్‌ అవుతూ ఉన్నాయి. స్మిత్‌ సినిమాల్లో నటనకు ఎంత ఫేమసో .. వివాదాలకు కూడా అంతే ఫేమస్‌. తరచుగా ఏదో ఒక వివాదంతో ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. 2022 ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో స్మిత్‌ ఓ కమెడియన్‌ను కొట్టిన సంఘటన యావత్‌ సినీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆస్కార్‌లో వేడుకల్లో భాగంగా కమెడియన్‌ స్టేజిపై మాట్లాడుతూ.. విల్‌ స్మిత్‌ భార్యపై కామెంట్లు చేశారు.

ఆ కామెంట్లతో విల్‌ స్మిత్‌ ఆగ్రహానికి గురయ్యారు. కమెడియన్‌ చెంపపై చాచి కొట్టారు. సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోలింగ్స్‌ వచ్చాయి. అంతేకాదు! సినిమా అవకాశాలు సైతం తగ్గిపోయాయి. దాదాపు సంవత్సరం తర్వాత స్మిత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్మిత్‌పై ఆయన మాజీ అసిస్టెంట్‌ బిలాల్‌ సంచలన కామెంట్లు చేశారు. విల్‌ స్మిత్‌ గే అని అన్నారు. ఆయనకు తోటి నటుడితో సంబంధం ఉందని పేర్కొన్నారు. బిలాల్‌ చెప్పిన దాని ప్రకారం.. ‘‘ విల్‌ స్మిత్‌కు తోటి నటుడు డ్యుయెన్‌ మార్టిన్‌తో సంబంధం ఉంది.

ఇద్దరూ శృంగారంలో ఉండగా నేను చూశాను. ఓ రోజు నేను మార్టిన్‌ డ్రెస్సింగ్‌ రూములోకి వెళ్లాను. అక్కడ ఓ సోఫా ఉంది. ఆ సోఫాపై ఇద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉన్నారు’’ అంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సినిమా సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వార్తలపై స్మిత్‌ కానీ, స్మిత్‌ తరపు వారు కానీ, ఎవరూ స్పందించలేదు. కాగా, విల్‌ స్మిత్‌ 1992లో వచ్చిన ‘వేర్‌ ది డే టేక్స్‌ యూ’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1995లో వచ్చిన బ్యాడ్‌ బాయ్స్‌ సినిమాతో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.

1997లో వచ్చిన ‘‘మెన్‌ ఇన్‌ బ్లాక్‌’’ సినిమా విల్‌ స్మిత్‌ కెరీర్‌లోనే మైలు రాయిగా నిలిచింది. మెన్‌ ఇన్‌ బ్లాక్‌ సాధించిన విజయంతో సీక్వెల్స్‌ కూడా వచ్చాయి. ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో వివాదం తర్వాత స్మిత్‌కు సంబంధించిన ఏ సినిమా విడుదల కాలేదు. ఆయన నటిస్తున్న ‘ బ్యాడ్‌ బాయ్స్‌’ ఫ్రాంఛైజ్‌ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. 2024లో ఈ సినిమా విడుదల కానుంది. మరి, విల్‌ స్మిత్‌పై ఆయన మాజీ అసిస్టెంట్‌ బిలాల్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş