iDreamPost
android-app
ios-app

రేపు థియేటర్స్‌లోకి 5 సినిమాలు! ఏ మూవీపై బజ్ ఉందంటే..?

  • Published Aug 01, 2024 | 8:55 PM Updated Updated Aug 01, 2024 | 8:55 PM

ఈ శుక్రవారం ఐదు సినిమాలు రాబోతున్నాయి. వీటిల్లో రాజ్ తరుణ్ తిరగబడరాసామీ, అల్లు శిరీష్ బడ్డీ, వరుణ్ సందేశ్ విరాజీ చిత్రాలున్నాయి. ఆగస్టు 2న విడుదలౌతున్న ఈ మూవీల్లో ఏ మూవీపై బజ్ ఉందంటే..?

ఈ శుక్రవారం ఐదు సినిమాలు రాబోతున్నాయి. వీటిల్లో రాజ్ తరుణ్ తిరగబడరాసామీ, అల్లు శిరీష్ బడ్డీ, వరుణ్ సందేశ్ విరాజీ చిత్రాలున్నాయి. ఆగస్టు 2న విడుదలౌతున్న ఈ మూవీల్లో ఏ మూవీపై బజ్ ఉందంటే..?

  • Published Aug 01, 2024 | 8:55 PMUpdated Aug 01, 2024 | 8:55 PM
రేపు థియేటర్స్‌లోకి 5 సినిమాలు! ఏ మూవీపై బజ్ ఉందంటే..?

ప్రతి శుక్రవారంలానే ఈ ఫ్రైడే కూడా కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ సారి భారీ బడ్జెట్ చిత్రాలు కాకుండా చిన్న సినిమాలు అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. అప్ కమింగ్ హీరోస్‌తో పాటు వెల్ నోన్ హీరోస్ కూడా తమ లక్ పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీటిల్లో అందరి దృష్టి తిరగబడరా సామిపై నెలకొంది. రాజ్ తరుణ్- లావణ్య ఇష్యూ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలవడం, అలాగే తన ప్రియుడ్ని వలలో వేసుకుందని హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై లావణ్య ఆరోపణలు చేయడంతో ప్రస్తుతం ఈ మూవీ హాట్ టాపిక్ అయ్యింది. వీటితో పాటు ఎప్పటి నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లు వారసుడు శిరీష్ కూడా బడ్డీ మూవీతో రాబోతున్నాడు. అలాగే వరుణ్ సందేశ్ విరాజి మూవీతో వస్తున్నాడు. వీటికి తోడు ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ఊర్వశివో, రాక్షసివో తర్వాత అల్లు శిరీష్ నుండి రాబోతున్న మూవీ బడ్డీ. టెడ్డీ బేర్ చుట్టూ కథ నడుస్తున్నట్లు తెలుస్తుంది. జులై 26న విడుదల కావాల్సిన ఈ మూవీ పోస్టు పోన్ అయ్యి.. ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. ఇది తమిళ్ మూవీ టెడ్డీకి రీమేక్ అనుకోగా.. కాదని వెల్లడించారు శిరీష్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్ కొట్డడం శిరీష్‌కు చాలా కీలకం. ఇక రాజ్ తరుణ్ పురుషోత్తముడు అనే మూవీతో రాగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లావణ్య వివాదం వల్ల ఆ మూవీకి ప్రమోషన్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు తిరగబడరా సామికి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. సినిమా కన్నా వివాదం కారణంగా ఈ సినిమాపై బజ్ నడుస్తోంది.

ఎఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన తిరగబడరసామీలో మాల్వీ మల్హోత్రా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇండస్ట్రీలో రావడానికి ముందే ఆమె పేరు అందరి నోళ్లల్లో నానింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. లవ్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తే. ఇక వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్‌తో వస్తున్న మూవీ విరాజీ. హారర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది ఓ సినిమా రీమేక్‌లా కనిపిస్తుంది. దీన్ని ఆద్యనాథ్ హర్ష తెరకెక్కించాడు. ప్రమోదిని, రఘు కారుమంచి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలపై విపరీతమైన బజ్ నడుస్తుంది. అలాగే కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన విజయ్ భాస్కర్ తన కుమారుడు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఉషా పరిణయం అనే మూవీని రూపొందించాడు. సరికొత్త ప్రేమకథా చిత్రంగా రాబోతుంది. అలాగే అలనాటి రామచంద్రుడు అనే సినిమా కూడా ఆగస్టు 2న రాబోతుంది. కృష్ణ వంశీ,మోక్ష హీరో హీరోయిన్లు. ఈ ఐదు సినిమాల్లో లక్‌ను ఏ మూవీ వరిస్తుందే చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom