iDreamPost
android-app
ios-app

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం.. ఆందోళనలో అభిమానులు

  • Published Mar 07, 2024 | 11:22 AM Updated Updated Mar 07, 2024 | 11:22 AM

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నివసించే అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం జరగడంతో.. జాక్వెలిన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నివసించే అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం జరగడంతో.. జాక్వెలిన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 07, 2024 | 11:22 AMUpdated Mar 07, 2024 | 11:22 AM
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం.. ఆందోళనలో అభిమానులు

బాలీవుడ్ ప్రేక్షకులకు అంతగా పరిచయం అవసరం లేని పేరు.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ఈ అమ్మడు పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. దాదాపు ప్రేక్షకులంతా ఈ భామను సినిమాలలో హీరోయిన్ గా కంటే.. ఐటెం సాంగ్స్ లోనే ఎక్కువగా చూసి ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమెకు ఫాలోయింగ్ ఎక్కువే. అయితే, ఈ అమ్మడి గురించి తాజాగా సామజిక మాధ్యమాలలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఇప్పుడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముంబైలోని బాంద్రావెస్ట్ లో .. నౌరోజ్ హిల్ సొసైటీలో ఉన్న 17 స్టోరీ అపార్ట్మెంట్ లో .. ఓ ఖరీదైన అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. గత ఏడాదే ఈ అమ్మడు ఈ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయింది. సాధారణంగా స్టార్ సెలెబ్రెటీలకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో .. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడి గురించి కూడా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.గత అర్ధరాత్రి అనగా బుధవారం రాత్రి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉండే అపార్ట్మెంట్ లోని 14వ ఫ్లోర్ లో ఓ వంట గది నుంచి మంటలు చెలరేగాయి. దీనితో అక్కడి స్థానికులు ఈ విషయాన్నీ ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ కు .. తెలియజేయడంతో.. వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. అయితే, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదని తెలియజేశారు.

అయితే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా అదే అపార్ట్మెంట్ లో నివసిస్తోంది. పైగా ఆమె ఈ ఘటన జరిగిన పైన ఫ్లోర్ లోనే ఉంటున్న కారణంగా .. ఆమెకు కూడా ఏదైనా ఆపద కలిగిందేమో అని.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనితో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అభిమానులు..ఆమె బాగోగుల గురించి పలువురిని ఆరా తీయగా ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదని బయటపడింది. అభిమానుల జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి ఆరా తీస్తూ .. ఆందోళన చెందడంతో .. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి అందిన సమాచారం ప్రకారం .. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సేఫ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. మరి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదంపై.. అభిమానులు ఆందోళన చెందిన విషయంలో .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletStarzbetStarzbetStarzbetmeritbetCasibom GirişmeritbetjojobetMeritbet güncel girişJojobet GirişbetraHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş