nagidream
Distributor Harish Sajja Passed Away: మహేష్ బాబు చేసిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. తర్వాత సినిమా కొనాలంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా భయం అనేది ఉంటుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తారు. కానీ ఒకరు మాత్రం సినిమా కొనడమే కాకుండా.. మహేష్ కెరీర్ లోనే తొలి రికార్డుని అందించారు. అలాంటి ఆయన గుండెపోటుతో మరణించారు.
Distributor Harish Sajja Passed Away: మహేష్ బాబు చేసిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. తర్వాత సినిమా కొనాలంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా భయం అనేది ఉంటుంది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తారు. కానీ ఒకరు మాత్రం సినిమా కొనడమే కాకుండా.. మహేష్ కెరీర్ లోనే తొలి రికార్డుని అందించారు. అలాంటి ఆయన గుండెపోటుతో మరణించారు.
nagidream
ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తారక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో దూకుడు చూపించారు. అదే దూకుడుతో మహేష్ కి అమెరికాలో తొలి రికార్డుని అందించారు. అప్పటికే మహేష్ వరుసగా మూడు సినిమాలతో పరాజయాన్ని చూశారు. స్టార్ హీరోల సినిమాలు అయినా కొనేందుకు ముందుకు రావడానికి భయపడే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకరు ముందుకొచ్చి సినిమాని కొనడం.. ఆ సినిమాతో మహేష్ కి తొలి రికార్డును అందించడం అంటే మామూలు విషయం కాదు. మహేష్ కెరీర్ లోనే క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి గుండెపోటుతో మరణించారు. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రముఖ స్టార్ డిస్ట్రిబ్యూటర్.. ఫికస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధినేత హరీష్ సజ్జ మృతి చెందారు. అమెరికాలోని తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించేవారు. యూఎస్ లో ఎన్నో తెలుగు సినిమాలను పంపిణీ చేసిన ఆయన అట్లాంటలోని ఇంట్లో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. హరీష్ సజ్జ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సంతాపం తెలియజేస్తున్నారు. హరీష్ సజ్జ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా హరీష్ సజ్జ అధినేతగా ఉన్న ఫికస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ.. అమెరికాలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2006లో తారక్ నటించిన రాఖీ సినిమాతో యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుస సినిమాలతో అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఎదిగారు. 2008 నుంచి 2016 వరకూ అమెరికాలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. ఆ సమయంలోనే మహేష్ నటించిన దూకుడు సినిమా పంపిణీ హక్కులను హరీష్ సజ్జ కొనుగోలు చేశారు. పోకిరి తర్వాత సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. సినిమాని కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు తడబడుతుంటే ఈయన ముందుకొచ్చి మహేష్ మీద, కథ మీద నమ్మకంతో కొనుగోలు చేశారు. అంతే ఆ సినిమా మహేష్ కెరీర్ లో ఫస్ట్ వన్ మిలియన్ డాలర్స్ సాధించిన సినిమాగా నిలిచింది. మహేష్ బాబు కెరీర్ లో అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ సాధించిన సినిమా అదే కావడం విశేషం. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రేసుగుర్రం, 1 నేనొక్కడినే, ఆగడు, జనతా గ్యారేజ్ వంటి అనేక సినిమాలను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు.