iDreamPost
android-app
ios-app

చిన్న తప్పు వల్ల ఫైట్ మాస్టర్ అరెస్టు.. ఆ తప్పు మీరూ చేస్తుంటారు జాగ్రత్త మరి!

  • Author Soma Sekhar Published - 05:03 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 05:03 PM, Tue - 11 July 23
చిన్న తప్పు వల్ల ఫైట్ మాస్టర్ అరెస్టు.. ఆ తప్పు మీరూ చేస్తుంటారు జాగ్రత్త మరి!

ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్ మీడియా వాడని మానవుడు లేడంటే అతిశయోక్తికాదు. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. వీడియోలు, ఫోటోలు చూడటం వరకు బాగానే ఉంటుంది కానీ.. వాటికి లైక్ కొట్టి, షేర్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలో పడే అవకాశాలు ఉంటాయి. తాజాగా ఓ స్టార్ ఫైట్ మాస్టర్ చేసిన చిన్న పొరపాటు కారణంగా కటకటాలపాలైయ్యాడు. ఓ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేయడం వల్ల ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్ అరెస్ట్ అయ్యారు. ఇంతకు అతడు ఏం చేశాడంటే?

కనల్ కన్నన్.. టాలీవుడ్ తో పాటుగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు ఫైట్ మాస్టర్ ర్ గా చేశారు. ఎందరో స్టార్ హీరోలకు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసి.. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తరచుగా వివాదాల్లో చిక్కుకునే కనల్ కన్నన్.. మరోసారి సమస్యల్లో చిక్కుకుని అరెస్ట్ అయ్యాడు. తాజాగా అతడు ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వివాదానికి దారితీసింది. అసలు విషయం ఏంటంటే? గత నెల 18న కనల్ కన్నన్ ఓ వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. ఇది వేరే దేశానికి సంబంధించినది అయినప్పటికీ అతడు తన ఖాతాలో షేర్ చేశాడు.

ఇక ఈ వీడియో విషయం సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దాంతో సోమవారం కనల్ కన్నన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కనల్ కన్నల్ ఇలా వివాదాస్పద కారణాల చేత గతంలోనూ జైలుపాలైయ్యాడు. గతంలో సోషల్ యాక్టివిస్ట్ పెరియార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయ్యాడు కనల్ కన్నన్. తాజాగా తనకు సంబంధం లేని వీడియోను షేర్ చేసి మరోసారి కటకటాలపాలైయ్యాడు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని షేర్ చేయకూడదు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏ వీడియో వెనుక ఏ ఉద్దేశం ఉందో తెలియదు కాబట్టి.. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇలాంటి తప్పులు మీరూ చేస్తున్నారా? జగ్రత్త మరి.

ఇదికూడా చదవండి: అభిమాని పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ! ఫోటోస్ వైరల్..

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet