iDreamPost
android-app
ios-app

క్రేజీ సీక్వెల్ లో ఫరియా అబ్దుల్లా.. హై ఓల్టేజ్ పోస్టర్ రిలీజ్..

  • Published Aug 27, 2024 | 9:12 PM Updated Updated Aug 27, 2024 | 9:12 PM

Faria Abdullah In Mathu Vadalara 2: తెలుగు ప్రేక్షకుల చిట్టి నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. అయితే ఆ వెయిటింగ్ ని వర్త్ గా మార్చేలా ఫరియా అబ్దుల్లా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Faria Abdullah In Mathu Vadalara 2: తెలుగు ప్రేక్షకుల చిట్టి నుంచి సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. అయితే ఆ వెయిటింగ్ ని వర్త్ గా మార్చేలా ఫరియా అబ్దుల్లా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • Published Aug 27, 2024 | 9:12 PMUpdated Aug 27, 2024 | 9:12 PM
క్రేజీ సీక్వెల్ లో ఫరియా అబ్దుల్లా.. హై ఓల్టేజ్ పోస్టర్ రిలీజ్..

ఫరియా అబ్దుల్లా అని చెప్పేకంటే.. చిట్టి అంటే తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టేస్తారేమో? చిట్టి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులు అవుతోంది. నిజానికి కల్కిలో కనిపించినా కూడా.. అది కేవలం క్యామియో మాత్రమే. కాబట్టి దానిని మనం సినిమాగా పరిగణించలేం. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కూడా.. సినిమా మాత్రం రావట్లేదు అని ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇలాంటి సమయంలో ఫరియా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుక వచ్చేందుకు రెడీ అయిపోయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పైగా ఫరియా చేస్తోంది అలాంటి ఇలాంటి సినిమా కాదు.. క్రేజీ సీక్వెల్ లో భాగం అయ్యింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న క్రేజీ థ్రిల్లర్ మరేదో కాదు.. మత్తు వదలరా 2. అవును మత్తు వదలరా 2లో ఫరియా అబ్ధుల్లా హీరోయిన్ అని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఫరియా అబ్ధుల్లా మత్తు వదలరా 2లో నిధి అని స్పష్టం చేశారు. గన్ పట్టుకుని ఉన్న ఒక హై ఓల్టేజ్ పిక్ ని అయితే రిలీజ్ చేశారు. నిన్న మత్తు వదలరా 2 పోస్టర్ అండ్ రిలీజ్ డేట్ వచ్చినప్పుడు ఫరియా క్లారిటీ ఇచ్చింది. సినిమా సీక్వెల్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతోంది అని చెప్పింది. ఈసారి.. క్రైమ్ చాలా పెద్దవిగా, దానిపైన వచ్చే సొమ్ము చాలా ఎక్కువగా.. నవ్వులు విపరీతంగా ఉండబోతున్నాయి అని క్లారిటీ ఇచ్చింది.

అలాగే ఈరోజు పోస్టర్ లో కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పింది. పొట్ట చక్కలయ్యే నవ్వులు.. అదిరిపోయే థ్రిల్స్ కోసం రెడీ అయిపోండి అంటూ ఫరియా అబ్ధుల్లా చెప్పుకొచ్చింది. అలాగే టీజర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ కామెంట్ చేసింది. ఈ రితేష్ రానా మత్తు వదలరా 2 సీక్వెల్ సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సీక్వెల్ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ సీక్వెల్ కోసం చాలానే ఎదురుచూస్తున్నారు. ఇంకా కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. మరి.. ఫరియా ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom