iDreamPost
android-app
ios-app

Faria Abdullah: అలాంటి వ్యక్తే భర్తగా కావాలి.. అది ఉంటే చాలు : ఫరియా అబ్దుల్లా

  • Published Apr 26, 2024 | 2:25 PM Updated Updated Apr 26, 2024 | 2:25 PM

చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి.. నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే అంటూ టాలీవుడ్ కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది ఫరియా. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో వస్తుంది. మరీ ఆమెకు కాబోయే వరుడు ఎలా ఉండాలంటే..

చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి.. నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే అంటూ టాలీవుడ్ కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది ఫరియా. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో వస్తుంది. మరీ ఆమెకు కాబోయే వరుడు ఎలా ఉండాలంటే..

  • Published Apr 26, 2024 | 2:25 PMUpdated Apr 26, 2024 | 2:25 PM
Faria Abdullah: అలాంటి వ్యక్తే భర్తగా కావాలి.. అది ఉంటే చాలు : ఫరియా అబ్దుల్లా

ఇటీవల తెలుగు అమ్మాయిలు హవా నడుస్తోంది. రీతు వర్మ, వైష్ణవి చైతన్య, గౌరీ ప్రియా, చాందినీ చౌదరి సత్తా చాటుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది మరో తెలుగు బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో చిట్టిగా గుర్తుండిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పుడు అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే నవ్వుల పువ్వులు పూయిస్తుంది. కొన్ని సినిమాల నుండి నరేష్ కామెడీని మిస్సైన ఫ్యాన్స్.. ట్రైలర్ చూసి ఈ అల్లరోడు ఈసారి పక్కా హిట్స్ కొట్టడం అని భావిస్తున్నారు. ఇందులో జామీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు నటిస్తున్నారు. మల్లి అంకం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రవి చిలక నిర్మిస్తున్నాడు.

గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న మే 3న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలో బిజీ బిజీగా గుడుపుతున్నారు హీరో హీరోయిన్లు నరేష్ అండ్ ఫరియా. ఇటీవల పాల్గొన్న ఇంటర్య్వూలో మీకు ఎలాంటి వరుడు కావాలన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది టాలీవుడ్ చిట్టి. సుమతో జరిపిన ఇంటర్వ్యూలో యాపిల్ బాక్స్ అవసరం లేని వాడే కావాలంటూ చెప్పుకొచ్చి నవ్వించింది. కాగా, మరో ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది. ‘నేను అరడుగుల ఎత్తు ఉంటాను. ఇక నాకు కాబోయే భర్త నా కంటే హైట్ తక్కువున్నా పర్లేదు. కానీ అతడిలో సెన్సాఫ్ హ్యుమర్ ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

తన లైఫ్‌లో చాలా కష్టాలు, బాధలు ఉన్నాయని, కనీసం రాబోయే భర్త అయినా ఫన్‌గా ఉంటే అదే సంతోషం అని చెప్పింది. ఫరియా హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ఆమె మంచి డ్యాన్సర్ అన్న విషయం తెలిసింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌కు చాలా మంది అభిమానులున్నారు. 2021లో జాతి రత్నాలు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఆరడుగుల సోయగం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్, బంగార్రాజు సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రల్లో మెరిసింది. అలాగే సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన లైక్, షేర్ అండ్ సబ్ స్రైబ్ చిత్రంలో నటించింది. అలాగే రవితేజ రావణాసురలో కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఆ ఒక్కటి అడక్కు మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet